మన రక్తనాళాలు శుభ్రంగా ఎలా ఉంచుకోవాలి ? చెత్త ఎలా బయటకి తీయాలి ?

ఫ్యాట్స్ ఎక్కువ ఉన్న ఆహారపదార్థాలు తింటున్నాం కదా మనం ? స్మోకింగ్ అలవాటు కూడా ఇక్కడ చాలామందికే ఉండి ఉంటుంది, అధిక బరువు ఎలాగో మనలో చాలామందికి ఉండే సమస్యే.ఇక మనకి వ్యాయయం చేసే మంచి అలవాటు ఏమైనా ఉందా అంటే అది కూడా ఉండదు.

 How To Clean Your Blood Vessels 1-TeluguStop.com

కనీసం మంచి ఆహరం తీసుకొని, మంచినీళ్ళు బాగా తాగుతున్నామా అంటే .చివరకి అది కూడా చేతకావట్లేదు కదా.ఇలా ఉన్నాక రక్తనాళాలలో టాక్సిన్స్ ఎందుకు జమ కావు ? కొలెస్టరాల్ ఎందుకు పెరగదు ? రక్త సరఫరా ఎలా బాగా జరుగుతుంది ? డయాబెటిస్ ఎందుకు రాకుండా ఉంటుంది ? గుండె ఎలా బ్రతికి ఉన్నన్నాళ్ళు సురక్షితంగా ఉంటుంది ? మరి ఇన్ని సమస్యలకు చికిత్స ఏంటి ? రక్తనాళాలు శుభ్రంగా ఉండటం.అవి శుభ్రంగా ఉంటేనే, మన శరీర భాగాలకి రక్తం, ఆక్సిజన్ బాగా అందుతాయి.

మరి రక్తనాళాలు శుభ్రంగా ఉండాలంటే ?

* మొదటగా, పైన చెప్పిన అలవాట్లు అన్ని మానేయాలి.మంచి ఆహారం తీసుకోవాలి, ధూమపానం, మద్యపానం లాంటి అలవాట్లు వద్దు.

శరీరం ఉన్నచోటే కూర్చొని ఉండకూడదు.కదలాలి, వ్యాయామం చేయాలి.

ఇక ఆహారంలోకి ఏం తీసుకోవాలి అంటే.

* పండ్లు బాగా తినాల్సిందే.

ముఖ్యంగా ఫైబర్ ఉన్న ఆపిల్, జామ, విటమిన్ సి ఉన్న ఆరెంజ్ .ఇలా చెప్పుకుంటూ పొతే, ప్రకృతి మనకి దీవెనలుగా అందించిన ఫలాలు ఎన్నో ఉన్నాయి .వాటిని ఇష్టపడి, ప్రాసెస్డ్ ఫుడ్స్ మానేయండి.

* సోలుబుల్ ఫైబర్ ఉన్న కూరగాయలని ప్రేమించండి.

అది స్వీట్ పొటాటో కావచ్చు, పాలకూర కావచ్చు, క్యారట్స్, బ్రోకోలి .ఇలా పెద్ద లిస్టు ఉంది.అలాగే పొటాషియం, మేగ్నేశియం ఉన్న కూరగాయలను తీసుకోండి.

* ఉల్లిపాయలు రక్తనాళాలకి మేలు చేసే ఆహారం.ఇది బ్లడ్ సర్కిలేషన్ ని గమనించదగ్గ స్థాయిలో మెరుగుపరుస్తుంది.ఇది బ్యాడ్ కొలెస్టరాల్ ని తగ్గిస్తూ, రక్తనాళాలని శుభ్రం చేస్తుంది.

ఉల్లిపాయలను ఏ విధంగా తీసుకోవాలో ఓసారి డాక్టర్ ని అడిగి, రోజు తీసుకోండి.

* సోడా కలపని నిమ్మరసాన్ని రోజు తాగండి.

ఇది ఎన్నోవిధాలుగా శరీరానికి ఉపయోగపడినా, విటమిన్ సి బాగా కలిగిన నిమ్మ చేసే మొదటి పని రక్తనాళాలు శుభ్రం చేయడం.ఇది ధమనులలో ఇరుక్కుపోయిన మలినాలని,కొలెస్టరాల్ ని బయటకి తోస్తుంది.

పొద్దున్నే నిమ్మరసం తాగే అలవాటు ఉంటే మంచిది.

* దానిమ్మ రసం కూడా మీ రక్త సరఫరాకి చాలా మంచిది.

ఇందులో యాంటిఆక్సిడెంట్స్ ఎక్కువ.ఇది ధమనుల్లో పేరుకుపోయిన చెత్త అంతా బయటకి తోస్తుంది.

అలాగే అల్లం .ఇది కూడా ఉల్లిపాయలు, దానిమ్మ చేసే పనే చేస్తుంది.

* ఇక చివరది చెప్పాల్సిన పని లేదు.క్రమంతప్పని వ్యాయాయం మీ శరీరానికి అవసరం.పొద్దున్నే లేచి వ్యాయామం చేయడం చేత కాకపోతే, నడవండి .వెళ్ళాల్సిన దూరం ఎక్కువ కాకపొతే సైకిల్ వాడండి .అంటే కాని ఏమి చేయకుండా శరీరాన్ని బద్ధకంగా మారిస్తే, మిమ్మల్ని ఎవరు బాగుచేయలేరు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube