ఇష్టం లేకుండా చేసిన ఆ సినిమా నా జీవితాన్ని మార్చేసింది : శరణ్య

రఘువరన్ బీటెక్( Raghuvaran B.Tech ) సినిమా రూ.8 కోట్లు పెట్టి తీస్తే రూ.53 కోట్లు వసూలు చేసి బ్లాక్‌బస్టర్ హిట్ అయింది.ఈ యాక్షన్ కామెడీ డ్రామాలో తల్లి సెంటిమెంటు చాలా ఎక్కువగా ఉంటుంది.ఇందులో హీరో ధనుష్‌కి( Dhanush ) తల్లిగా శరణ్య పొన్‌వణ్ణన్( Saranya Ponvannan ) అద్భుతంగా నటించి మెప్పించింది.

 Actress Saranya About Raghuvaran Btech Movie Details, Actress Saranya ,raghuvara-TeluguStop.com

ఈ మూవీలో ఆమెను చూస్తున్నంత సేపు మనకు మన సొంత తల్లి గుర్తుకు వస్తుంది.అంత సహజంగా ఆమె నటించింది.శరణ్య చాలా గొప్ప పాత్రలు పోషించింది.అయితే రఘువరన్ బీటెక్ సినిమాలో తల్లి పాత్ర పోషించడానికి శరణ్య ముందుగా ఒప్పుకోలేదు.

ఇది మనకు షాకింగ్ గా అనిపించవచ్చు కానీ ఈ మాటే వాస్తవం.

ఆ విషయాన్ని ఆమే ఇటీవల ఒప్పుకున్నది.

విఐపీ (తెలుగులో రఘువరన్ బీటెక్) సినిమాని ధనుష్ సొంతంగా ప్రొడ్యూస్ చేశాడు.ఆ సినిమాలో తల్లి పాత్రను శరణ్య చేతనే చేయించాలని ధనుష్ అనుకున్నాడు.

కథ చెప్పడానికి ఆమె ఇంటికి వెళ్లాడు.అంతేకాదు తనకు నచ్చిన ఫుడ్ ఐటమ్స్ లిస్టు శరణ్యకు తెలిపాడు.

అవి ప్రిపేర్ చేసి ఉంచాలని, తినేసి కథ చెప్పి వెళ్తానని శరణ్యకు ఫోన్ కాల్ చేసి చెప్పాడు.

Telugu Actress Saranya, Dhanush, Saranyamother, Tollywood, Vip-Movie

శరణ్య ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.” చెప్పినట్లుగానే హీరో ధనుష్ మా ఇంటికి వచ్చాడు.భోజనం చేశాడు.

తర్వాత స్టోరీ చెప్పాడు.నాకు ఆ కథ చాలా యావరేజ్‌గా అనిపించింది.

అమ్మ పాత్రకు( Mother Character ) అసలు ఎలాంటి ఇంపార్టెన్స్ లేదనే ఫీలింగ్ కలిగింది.ఆ పాత్రే ప్రాధాన్యత లేనిది అని అనుకుంటే దాన్ని మధ్యలోనే చంపేస్తారని తెలుసుకొని ఇక ఆ సినిమా చేయకూడదని అనుకున్నా.

ఇదే విషయాన్ని చాలా సున్నితంగా ధనుష్‌తో చెప్పాను.ఆ సమాధానం వినగానే ధనుష్ డిసప్పాయింట్ అవ్వలేదు.“నన్ను నమ్మండి.ఈ పాత్ర మీకు తప్పనిసరిగా చాలా పేరు తెస్తుంది’ అని ధనుష్ చెప్పాడు.” అని శరణ్య చెప్పుకొచ్చింది.

Telugu Actress Saranya, Dhanush, Saranyamother, Tollywood, Vip-Movie

అయితే ధనుష్ ఎంతో నమ్మకంగా మాటిచ్చినా ఆమె ఆ రోల్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు.మీ పైన ఒక మంచి ఎమోషనల్ సాంగ్ కూడా ఉంటుందని చెప్పిన తర్వాత ఇక ధనుష్ మాట కాదనలేక సరే అని ఈ సినిమా చేయడానికి ఓకే చెప్పింది.ఇష్టం పెద్దగా లేకపోయినా సినిమా షూటింగ్ కి వెళ్ళింది.

షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా తల్లి క్యారెక్టర్‌కు పెద్దగా ఇంపార్టెన్స్ లేదని ఆమె ఫీల్ అయింది.తన సీన్లు చాలా ఫాస్ట్‌గా అయిపోయాయని ఆమె అనుకుంది.

Telugu Actress Saranya, Dhanush, Saranyamother, Tollywood, Vip-Movie

శరణ్య ఇంకా మాట్లాడుతూ.“ఎప్పుడైతే నా పాత్రకు డబ్బింగ్ చెప్పడం ప్రారంభించానో, సినిమాలోని నా సన్నివేశాలు చూశానో అప్పుడే నాకు అర్థమైంది.నా పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉందనేది.నేనున్న సన్నివేశాలకు ముందు వెనుకా చాలా ఎమోషనల్ సీన్లు యాడ్ చేసి సినిమాను చక్కగా తీశారు.అమ్మ పాత్ర మధ్యలోనే చనిపోయినా, ఆ పాత్ర మాత్రం సినిమా మొత్తం ఉన్నట్లుగా అనిపించింది.అంత గొప్పగా అమ్మ పాత్రను రాసుకున్నారు.

వీఐపీ( VIP ) విడుదల అయిన నెక్స్ట్ డే నుంచే ఇండస్ట్రీ మొత్తం నన్ను అమ్మగా చూడటం మొదలు పెట్టింది.ఆ సినిమాతో నా కెరీర్ వేరే స్థాయికి చేరుకుంది.” అని చెప్పింది.శరణ్య ధనుష్ కారణంగా ఈ పాత్ర చేసింది.

లేకపోతే ఇంత మంచి రోల్ ఆమె మిస్ చేసుకుని ఉండేది.అలా జరగకపోవడమే ఆమె అదృష్టం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube