సోగ్గాడు శోభన్ బాబు( Sobhan Babu ) చాలా అందంగా ఉంటాడు.ముఖ్యంగా ఆయన రింగ్ హెయిర్‌స్టైల్ అప్పట్లో అమ్మాయిల హృదయాలను దోచేసింది.
ఈ హీరో అందాన్ని ఆ రింగ్ హెయిర్ స్టైల్ బాగా పెంచేసింది.శోభన్ బాబు రింగ్( Sobhan Babu Ring ) బాగా పాపులర్ అయింది.
ఎవరైనా జుట్టు కాస్త అందంగా దూసుకుంటే చాలు చాలామంది శోభన్ బాబు రింగ్ లా ఉంది అంటూ పొగుడుతారంటే అతిశయోక్తి కాదు.అయితే ఈ శోభన్ బాబు రింగ్ అనేది ఒక సినిమా నుంచి స్టార్ట్ అయింది.
ఆ సినిమా మరేదో కాదు “జేబుదొంగ”.( Jebu Donga Movie )
1975లో వచ్చిన ఈ సినిమాలో శోభన్ బాబు-మంజుల విజయకుమార్ హీరో హీరోయిన్లుగా నటించారు.ఈ మూవీలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా పండింది.ఈ సినిమా తీస్తున్న సమయంలోనే శోభన్ బాబు, మంజుల పెళ్లి చేసుకోబోతున్నారంటూ రూమర్స్ హల్చల్ చేశాయి.కానీ అలా ఏమీ జరగలేదు.ఆమె తమిళ యాక్టర్ విజయకుమార్ ని పెళ్లి చేసుకున్నారు.
ఆ సంగతి పక్కన పెడితే జేబుదొంగ సూపర్ హిట్ అయింది.నిర్మాతకు, డిస్ట్రిబ్యూటర్లకు, థియేటర్ల యజమానులకు చాలా లాభాలు తెచ్చి పెట్టింది.శోభన్ బాబు సినిమాల్లో సోగ్గాడు సినిమా( Soggadu Movie ) తర్వాత హైయెస్ట్ కలెక్షన్లు వసూలు చేసిన మూవీగా ఇది నిలిచింది.ఈ సినిమాలో శోభన్ బాబు-మంజుల రొమాన్స్ ప్రేక్షకులకు బాగా నచ్చింది.
పాటలు కూడా చాలా బాగున్నాయి.గోవిందో గోవింద పాటలో ఎన్టీఆర్ లాగా శోభన్ బాబు డాన్స్ చేసిన తీరు అందర్నీ ఆకట్టుకుంది.
శోభన్ బాబు ఈ మూవీలో చాలా హుషారుగా నటించాడు.ఇందులోని రాజబాబు కామెడీ ప్రేక్షకులను బాగా నవ్వించింది అందుకే ఈ సినిమా చాలా సెంటర్లలో వంద రోజులు ఆడి సూపర్ సక్సెస్ అయ్యింది.
వి.మధుసూధనరావు డైరెక్ట్ చేసిన జేబుదొంగ సినిమాకు ముళ్ళపూడి డైలాగ్స్ అందించారు.చక్రవర్తి పాటలు కంపోజ్ చేశాడు.“నీలాల నింగిలో మేఘాల తేరులో” పాట అప్పటి ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.ఈ మెలోడియస్ సాంగ్ ను ఇప్పటికీ చాలామంది వింటూ ఉంటారు.గోవిందో గోవింద గుట్టు కాస్తా గోవిందా , రేగాడు రేగాడు పాటల్లో శోభన్ బాబు , మంజుల బాగా రొమాన్స్ చేస్తూ సెగలు పుట్టించారు.
మిగతా పాటలు కూడా చూడడానికి చాలా బాగుంటాయి.
ఈ సినిమా యూట్యూబ్ లో ఉంది.
ఈ మూవీ పోస్టర్ లో కూడా శోభన్ బాబు నుదుటిపై వచ్చిన ఆ హెయిర్ రింగు మనం చూడవచ్చు.ఈ లుక్ లో అతను చాలా అందంగా ఉన్నాడు కాబట్టి అదే హెయిర్ రింగు కొనసాగించాడు.