శోభన్ బాబు రింగు ఈ సినిమా నుంచి స్టార్ట్ అయ్యిందా..??
TeluguStop.com
సోగ్గాడు శోభన్ బాబు( Sobhan Babu ) చాలా అందంగా ఉంటాడు.ముఖ్యంగా ఆయన రింగ్ హెయిర్‌స్టైల్ అప్పట్లో అమ్మాయిల హృదయాలను దోచేసింది.
ఈ హీరో అందాన్ని ఆ రింగ్ హెయిర్ స్టైల్ బాగా పెంచేసింది.శోభన్ బాబు రింగ్( Sobhan Babu Ring ) బాగా పాపులర్ అయింది.
ఎవరైనా జుట్టు కాస్త అందంగా దూసుకుంటే చాలు చాలామంది శోభన్ బాబు రింగ్ లా ఉంది అంటూ పొగుడుతారంటే అతిశయోక్తి కాదు.
అయితే ఈ శోభన్ బాబు రింగ్ అనేది ఒక సినిమా నుంచి స్టార్ట్ అయింది.
ఆ సినిమా మరేదో కాదు "జేబుదొంగ".( Jebu Donga Movie )
1975లో వచ్చిన ఈ సినిమాలో శోభన్ బాబు-మంజుల విజయకుమార్ హీరో హీరోయిన్లుగా నటించారు.
ఈ మూవీలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా పండింది.ఈ సినిమా తీస్తున్న సమయంలోనే శోభన్ బాబు, మంజుల పెళ్లి చేసుకోబోతున్నారంటూ రూమర్స్ హల్చల్ చేశాయి.
కానీ అలా ఏమీ జరగలేదు.ఆమె తమిళ యాక్టర్ విజయకుమార్ ని పెళ్లి చేసుకున్నారు.
"""/" /
ఆ సంగతి పక్కన పెడితే జేబుదొంగ సూపర్ హిట్ అయింది.
నిర్మాతకు, డిస్ట్రిబ్యూటర్లకు, థియేటర్ల యజమానులకు చాలా లాభాలు తెచ్చి పెట్టింది.శోభన్ బాబు సినిమాల్లో సోగ్గాడు సినిమా( Soggadu Movie ) తర్వాత హైయెస్ట్ కలెక్షన్లు వసూలు చేసిన మూవీగా ఇది నిలిచింది.
ఈ సినిమాలో శోభన్ బాబు-మంజుల రొమాన్స్ ప్రేక్షకులకు బాగా నచ్చింది.పాటలు కూడా చాలా బాగున్నాయి.
గోవిందో గోవింద పాటలో ఎన్టీఆర్ లాగా శోభన్ బాబు డాన్స్ చేసిన తీరు అందర్నీ ఆకట్టుకుంది.
శోభన్ బాబు ఈ మూవీలో చాలా హుషారుగా నటించాడు.ఇందులోని రాజబాబు కామెడీ ప్రేక్షకులను బాగా నవ్వించింది అందుకే ఈ సినిమా చాలా సెంటర్లలో వంద రోజులు ఆడి సూపర్ సక్సెస్ అయ్యింది.
"""/" /
వి.మధుసూధనరావు డైరెక్ట్ చేసిన జేబుదొంగ సినిమాకు ముళ్ళపూడి డైలాగ్స్ అందించారు.
చక్రవర్తి పాటలు కంపోజ్ చేశాడు."నీలాల నింగిలో మేఘాల తేరులో" పాట అప్పటి ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.
ఈ మెలోడియస్ సాంగ్ ను ఇప్పటికీ చాలామంది వింటూ ఉంటారు.గోవిందో గోవింద గుట్టు కాస్తా గోవిందా , రేగాడు రేగాడు పాటల్లో శోభన్ బాబు , మంజుల బాగా రొమాన్స్ చేస్తూ సెగలు పుట్టించారు.
మిగతా పాటలు కూడా చూడడానికి చాలా బాగుంటాయి.ఈ సినిమా యూట్యూబ్ లో ఉంది.
ఈ మూవీ పోస్టర్ లో కూడా శోభన్ బాబు నుదుటిపై వచ్చిన ఆ హెయిర్ రింగు మనం చూడవచ్చు.
ఈ లుక్ లో అతను చాలా అందంగా ఉన్నాడు కాబట్టి అదే హెయిర్ రింగు కొనసాగించాడు.
గుడ్ న్యూస్ చెప్పిన రేణు దేశాయ్.. ఏడాది తర్వాత అంటూ పోస్ట్!