తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ ( Rocking Rakesh )గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.జబర్దస్త్ లో ఎన్నో స్కిట్లు చేసి తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు రాకేష్.
పిల్లలతో పెద్దలతో కలిసి ఎన్నో రకాల స్కిట్లు వేసి ఎంతోమంది నవ్వించడంతోపాటు భారీగా అభిమానులను కూడా సంపాదించుకున్నారు.లోకేష్ ప్రస్తుతం జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలు కూడా చేస్తున్న విషయం తెలిసిందే.
ఇకపోతే రాకింగ్ రాకేష్ ప్రముఖ న్యూస్ యాంకర్ జోర్దార్ సుజాతను( News Anchor Zordar Sujathanu ) ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
కాగా సుజాత ప్రముఖ న్యూస్ యాంకర్ గా భారీగా గుర్తింపు తెచ్చుకుంది.ఒకవైపు న్యూస్ యాంకర్ గా చేస్తూనే మరొకవైపు జబర్దస్త్ కి ఎంట్రీ ఇచ్చే తన కామెడీతో బాగా నవ్వించిన సుజాత ఆ తర్వాత నెమ్మదిగా రాకేష్ తో ప్రేమలో పడడంతో పాటు వీరిద్దరు మూడుముళ్ల బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే.అయితే ప్రస్తుతం సుజాత ప్రెగ్నెంట్( Sujata is pregnant ).ఇదే విషయాన్ని ఈ దంపతులు ఇద్దరు ఇటీవల సోషల్ మీడియా వేదికగా తెలిపారు.ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ సుజాత బేబీ బంపుకు( baby bump ) సంబంధించిన ఫొటోస్ వైరల్ గా మారాయి.
అయితే ఆ ఫొటోస్ ని చూస్తే సుజాతకు శ్రీమంతం వేడుకలు నిర్వహించినట్లు తెలుస్తోంది.
ఆ ఫొటోస్ లో సుజాత ఎంచక్కా పట్టు చీర కట్టుకునే ఫోటోలకు చిరునవ్వులు చిందిస్తోంది.రాకేష్ కూడా ఆ తెల్ల చొక్కా పంచే కట్టుకొని పద్ధతిగా సాంప్రదాయబద్ధంగా సుజాతతో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.వీటితోపాటు వారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆ ఫోటోలో ఉన్నారు.
ఇక ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పలువురు సెలబ్రిటీలు అలాగే అభిమానులు ఆ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.