జక్కన్న డాక్యుమెంటరీలో ఆర్ఆర్ఆర్ మూవీ డిలీటెడ్ సీన్.. ఆ సీన్ ప్రత్యేకతలు ఇవే!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి( SS Rajamouli ) దర్శకత్వం వహించిన సినిమా ఆర్ఆర్ఆర్.

 Ram Charan Fans Thrilled See Unseen Footage Rrr Modern Masters, Ram Charan, Rrr,-TeluguStop.com

ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ,రామ్ చరణ్ లు హీరోలుగా నటించిన విషయం తెలిసిందే.దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన ఈ సినిమా వసూళ్ల సునామీని సృష్టించింది.

అంతేకాకుండా ఈ సినిమాతో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ లో గ్లోబల్ స్టార్లుగా కూడా మారారు.ఇక ఈ సినిమాలో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు సైతం దక్కిన విషయం తెలిసిందే.

ఇకపోతే ఈ సినిమా డైరెక్టర్ అయిన రాజమౌళి పై మోడ్రన్ మాస్టర్స్( Modern Masters ) పేరుతో నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ రూపొందించిన విషయం తెలిసిందే.అయితే ఈ నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో ఆర్ఆర్ఆర్‌ సినిమాకు సంబంధించిన ఒక సీన్‌ వైరల్ గా మారింది.ఇందులో హీరో రామ్ చరణ్‌ ( Hero Ram Charan )ఎడ్లబండిపై నిలబడి ఉన్న సన్నివేశం చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.అయితే ఈ సీన్‌ ఆర్ఆర్ఆర్‌ సినిమాలో లేదు.

షూటింగ్‌కు సంబంధించిన ఈ క్లిప్‌ ను మోడరన్ మాస్టర్స్ డాకుమెంటరీలో చూపించారు.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఇక ఆ సీన్ ని చూసిన అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇకపోతే రాజమౌళి విషయానికి వస్తే ప్రస్తుతం జక్కన్న తన తదుపరి సినిమా మహేష్ బాబుతో చేయబోతున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పనుల్లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు రాజమౌళి.ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మించడానికి సిద్ధమవుతున్నారు జక్కన్న.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు కూడా వినిపించిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube