జక్కన్న డాక్యుమెంటరీలో ఆర్ఆర్ఆర్ మూవీ డిలీటెడ్ సీన్.. ఆ సీన్ ప్రత్యేకతలు ఇవే!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి( SS Rajamouli ) దర్శకత్వం వహించిన సినిమా ఆర్ఆర్ఆర్.

ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ,రామ్ చరణ్ లు హీరోలుగా నటించిన విషయం తెలిసిందే.

దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన ఈ సినిమా వసూళ్ల సునామీని సృష్టించింది.

అంతేకాకుండా ఈ సినిమాతో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ లో గ్లోబల్ స్టార్లుగా కూడా మారారు.

ఇక ఈ సినిమాలో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు సైతం దక్కిన విషయం తెలిసిందే.

"""/" / ఇకపోతే ఈ సినిమా డైరెక్టర్ అయిన రాజమౌళి పై మోడ్రన్ మాస్టర్స్( Modern Masters ) పేరుతో నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ రూపొందించిన విషయం తెలిసిందే.

అయితే ఈ నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో ఆర్ఆర్ఆర్‌ సినిమాకు సంబంధించిన ఒక సీన్‌ వైరల్ గా మారింది.

ఇందులో హీరో రామ్ చరణ్‌ ( Hero Ram Charan )ఎడ్లబండిపై నిలబడి ఉన్న సన్నివేశం చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

అయితే ఈ సీన్‌ ఆర్ఆర్ఆర్‌ సినిమాలో లేదు.షూటింగ్‌కు సంబంధించిన ఈ క్లిప్‌ ను మోడరన్ మాస్టర్స్ డాకుమెంటరీలో చూపించారు.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.ఇక ఆ సీన్ ని చూసిన అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

"""/" / ఇకపోతే రాజమౌళి విషయానికి వస్తే ప్రస్తుతం జక్కన్న తన తదుపరి సినిమా మహేష్ బాబుతో చేయబోతున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పనుల్లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు రాజమౌళి.

ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మించడానికి సిద్ధమవుతున్నారు జక్కన్న.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు కూడా వినిపించిన విషయం తెలిసిందే.

వీడియో: ఇదెక్కడి మాస్ చోరీ బాబోయ్.. పట్టపగలే ఎత్తుకెళ్తున్నారుగా..?