సౌదీ అరేబియాకి వెళ్లిన నాలుగో రోజే తెలంగాణ వ్యక్తి మృతి..?

బతుకు తెరువు కోసం పక్క దేశాలకు వెళ్తున్న వారి సంఖ్య పెరుగుతోంది.కామారెడ్డి జిల్లాకు( Kamareddy District ) చెందిన 39 ఏళ్ల మహ్మద్ షరీఫ్( Mohammed Sharif ) అనే వ్యక్తి కూడా ఇటు ఎలా ఉపాధి కోసం సౌదీ అరేబియాకి( Saudi Arabia ) వెళ్ళాడు.

 Telangana Nri Dies At Park Four Days After Landing In Saudi Arabia Details, Tela-TeluguStop.com

అయితే ఆ దేశానికి వెళ్లిన నాలుగు రోజుకే అతను మరణించాడు.అతని మృతదేహం మహ్మద్‌ది అని గుర్తించడానికి 45 రోజులు పట్టింది.

రెండు రోజుల క్రితమే మహ్మద్ శవాన్ని భారతదేశానికి తీసుకొచ్చారు.

షరీఫ్ జూన్ 3న రియాద్‌లోని క్లీనింగ్ కంపెనీలో డ్రైవర్‌గా( Driver ) పని చేయడానికి వెళ్లాడు.

అదే రోజు తన కుటుంబానికి సురక్షితంగా అక్కడికి చేరుకున్నట్లు తెలిపాడు.ఆ తర్వాత నుంచి అతను ఫోన్ ఎత్తలేదు.కుటుంబ సభ్యులు మహ్మద్‌ నంబర్‌కు ఫోన్ చేసినప్పుడు స్విచ్ఛాఫ్ అని వచ్చింది.అతను అక్కడికి వెళ్లి నాలుగు రోజులకు, జూన్ 7న, ఆ నగరంలోని అజీజియా పార్క్‌లో ఒక మృతదేహం లభ్యమైంది.

వైద్య నివేదికల ప్రకారం, మహ్మద్‌ గుండెపోటుతో( Heart Attack ) మరణించాడు.

Telugu Company, Heart Attack, Kama, Mohammed Sharif, Nri, Riyadh, Saudi Arabia,

పోలీసులు ఆ మృతదేహం ఒక భారతీయ పౌరుడిదని నిర్ధారించారు.కానీ, ఎవరూ ముందుకు వచ్చి ఆ మృతదేహాన్ని తీసుకోలేదు.దీంతో, పోలీసులు ప్రముఖ భారతీయ సామాజిక కార్యకర్త షిహాబ్ కోట్టుకాడ్‌ను సంప్రదించి, మృతుని బంధువుల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించారు.అతని బయోమెట్రిక్ వివరాల ఆధారంగా, అతని పాస్‌పోర్ట్ చిరునామాను కనుక్కొని, అతని కుటుంబానికి మరణం గురించి తెలియజేశారు

Telugu Company, Heart Attack, Kama, Mohammed Sharif, Nri, Riyadh, Saudi Arabia,

మహ్మద్‌ తన పనికి రాకపోవడంతో, అతని యజమాని మహ్మద్‌ పారిపోయాడని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.దీనిని ‘హురూబ్’ అని అంటారు.హురూబ్ నోటిఫికేషన్ ఉండటం వల్ల మృతదేహాన్ని భారతదేశానికి తీసుకురావడంలో ఇబ్బంది ఏర్పడింది.షిహాబ్ అనే వ్యక్తి అవసరమైన చట్టపరమైన కార్యక్రమాలను పూర్తి చేసి, భారతదేశ దౌత్యవేత్తల సహాయంతో షరీఫ్ మృతదేహాన్ని భారతదేశానికి తీసుకువచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube