తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో వైవిధ్యమైన గుర్తింపును సంపాదించుకున్న నటులు విక్రమ్…( Vikram ) తను రెగ్యూలర్ కమర్షియల్ సినిమాలకు విభిన్నంగా ప్రయోగత్మకమైన సినిమాలను చేస్తూ వస్తున్నాడు.ఇక అందులో భాగంగానే తంగలాన్ సినిమాతో( Thangalaan ) కూడా మరోసారి స్టార్ హీరోగా తనను ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇక అందులో భాగంగానే ఆగస్టు 15వ తేదీన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతుంది.ఇక ఈ సందర్భంలో ఈ సినిమా డైరెక్టర్ అయిన పా.
రంజిత్( Pa.Ranjith ) ఈ సినిమాకి సంబంధించిన కొన్ని విషయాలను మీడియాతో పంచుకున్నాడు.ఇక ఈ సినిమా సమయంలో ఆయనకు విపరీతమైన టెన్షన్ ఉండేదట.
ఎందుకంటే ఒక్కో షెడ్యూల్ తను అనుకున్నట్టుగా వస్తుందా రాదా? ఆర్టిస్టులు బాగా పర్ఫామెన్స్ ఇస్తారా లేదా అనే ఉద్దేశ్యం తోనే ఆయన చాలావరకు ఇబ్బంది పడట్టుగా చెప్పాడు.ఇక ఆర్టిస్టులు కానీ అక్కడ ఉన్న జూనియర్ ఆర్టిస్టు గాని సక్రమంగా చేయకపోవడం ఆయనని విసిగించడం లాంటివి చేస్తుంటే ఆయనకు చాలా వరకు కోపం వచ్చేదట.అలా కొన్ని సందర్భాల్లో ఆర్టిస్టుల మీద కూడా అరిచేవాడిని అంటూ ఆయన ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం…
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో పాటు ఈనెల 15వ తేదీన మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి.మరి ఈ రెండు సినిమాలను కాదని విక్రమ్ పాన్ ఇండియా రేంజ్ లో భారీ సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది… ఇక మొత్తానికైతే విక్రమ్ పడిన కష్టానికి ప్రతిఫలం దక్కుతుందా లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…చూడాలి మరి ఈ సినిమాల్లో ఏ సినిమా సూపర్ సక్సెస్ అవుతుంది అనేది…
.