వాలంటీర్ల విషయంలో సస్పెన్స్ .. వాటిని తొలగించాలంటూ ఆదేశాలు 

ఏపీలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం వలంటీర్ల వ్యవస్థను( Volunteer System ) కొనసాగిస్తుందా రద్దు చేస్తుందా అనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.ఏపీలో ఎన్నికలకు ముందు టిడిపి( TDP ) అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తుందని,  ఈ వ్యవస్థ సక్రమంగా కొనసాగాలంటే మళ్ళీ వైసిపి నే గెలిపించాలంటూ పదే పదే వైసిపి అధినేత జగన్( YS Jagan ) ఎన్నికల ప్రచారంలో జనాలకు విజ్ఞప్తి చేశారు.

 Ap Government Key Decision On Volunteer System Details, Ap Government, Ap Tdp, J-TeluguStop.com

దీనికి కౌంటర్ గా టిడిపి కూటమి పార్టీలు వాలంటీర్ వ్యవస్థను కొనసాగించడంతో పాటు , 5000 గా ఉన్న వారి గౌరవ వేతనాన్ని 10 వేలకు పెంచి ఇస్తామని హామీ ఇచ్చారు.ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో వాలంటీర్ వ్యవస్థ విషయంలో టిడిపి మాట నిలబెట్టుకుంటుందా లేక ఈ వ్యవస్థను రద్దు చేస్తారా అనే విషయంలో ఏ క్లారిటీ రావడం లేదు.

Telugu Ap, Ap Tdp, Ap Volunteers, Chandrababu, Jagan, Janasena, Tdp Alliance, Te

ఈ విషయంలో టిడిపి అధినేత,  ఏపీ సీఎం చంద్రబాబు( CM Chandrababu ) సైతం ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు .అయితే వాలంటీర్ల సంఖ్యను బాగా కుదిరిస్తారని ప్రచారం జరుగుతోంది.అసలు వాలంటీర్ల విషయంలో ఏపీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది అందరికీ ఆసక్తికరంగా మారింది.ఈనెల ఏడో తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో వాలంటీర్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం.

Telugu Ap, Ap Tdp, Ap Volunteers, Chandrababu, Jagan, Janasena, Tdp Alliance, Te

ఇక వాలంటరీ సేవల విషయంలో తాజాగా అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు.గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్లు పథకాలు , నిర్ణయాలను ప్రజలకు చేరవేసేందుకు వాట్సాప్ , టెలిగ్రామ్ గ్రూపులను ఏర్పాటు చేశారు.తమ క్లస్టర్ పరిధిలోని లబ్ధిదారులతో ఈ గ్రూపులను కొనసాగించారు .వాలంటీర్లు నిర్వహించిన అన్ని గ్రూపులను తక్షణమే తొలగించాలని వార్డు గ్రామ సచివాలయాలకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.క్షేత్రస్థాయిలో వెంటనే ఈ ఆదేశాలు అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు .అంతేకాదు తొలగించిన గ్రూపుల వివరాలను సాయంత్రం లోపు ఇవ్వాలని సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube