టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్పుత్( Payal Rajput ) గురించి మనందరికీ తెలిసిందే.మొదట ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాతో భారీ సక్సెస్ ను అందుకుంది.
ఈ సినిమా తర్వాత తెలుగులో పలు సినిమాలలో నటించి హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.ఇది ఇలా ఉంటే ప్రస్తుతం పాయల్ కేవలం సెలెక్టివ్ గా మాత్రమే సినిమాలు చేస్తోంది.
ఆ సంగతి పక్కన పెడితే తాజాగా ఈమె ఫిలింఫేర్ అవార్డుల( Filmfare Awards ) ప్రదానోత్సవంలో సందడి చేసింది.ఈ అవార్డుల వేడుకలో తాను తొలిసారి పాల్గొంటున్నాను తెలిపింది.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.కాగా ఈ సందర్బంగా పాయల్ మాట్లాడుతూ.ఇప్పటివరకూ నేను చాలా అవార్డుల కార్యక్రమాల్లో పాల్గొన్నాను.ఐఫా, సైమా వంటి ప్రోగ్రామ్స్ లో సందడి చేశాను.కానీ ఫిలింఫేర్ కు హాజరు కావడం ఇదే మొదటి సారి.సినిమాను సెలబ్రేట్ చేసుకోవడానికి ఇదొక మంచి ప్లాట్ఫామ్.
వివిధ భాషలకు చెందిన నటీనటులను ఇక్కడ కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది అని పాయల్ చెప్పుకొచ్చింది.
తర్వాత ఒక రిపోర్టర్ ఇప్పటివరకూ మీ గురించి వచ్చిన ఫన్నీ రూమర్ ఏమిటి? అని ప్రశ్నించగా పాయల్ స్పందిస్తూ.ప్రభాస్( Prabhas ) తో నా పెళ్లైందంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి.వాటిని చూసి బాగా నవ్వుకున్నాను.
ఇది నిజమైతే బాగుండు అనుకున్నా అని నవ్వుతూ సమాధానం ఇచ్చింది.ఈ సందర్భంగా పాయల్ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
కాగా పాయల్ రాజ్ పూర్తి తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా సినిమాలలో నటించిన విషయం తెలిసిందే.