నందమూరి మోక్షజ్ఞ( Mokshagna Teja).గత కొంతకాలంగా సోషల్ మీడియాలో మారుమోగుతున్న పేరు.
నందమూరి బాలకృష్ణ కొడుకు నందమూరి మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీకీ హీరోగా ఎప్పుడు ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని అభిమానులు ఎప్పటినుంచో ఎంతో ఆత్రుత ఎదురుచూస్తున్నారు.ఇక ఇప్పటికే ఎన్నోసార్లు ఎన్నో వార్తలు కూడా వినిపించిన విషయం తెలిసిందే.
కానీ ఎట్టకేలకు మోక్షజ్ఞ ఎంట్రీ కన్ఫర్మ్ అయ్యింది.త్వరలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అనే వార్త బాలయ్య అభిమానులకు రెట్టింపు ఉత్సాహాన్ని నింపుతోంది.
మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకోవాలని తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోవాలని మోక్షజ్ఞ ప్రయత్నాలు చేస్తుండగా నందమూరి అభిమానులు కూడా ఈ విషయాన్ని గట్టిగా కోరుకుంటున్నారు.
కాగా మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ( Prasanth Varma ) దర్శకుడన్న విషయం అందరకి తెలిసిందే.ఇది రూమర్ గా చక్కెర్లు కొట్టే అవకాశం లేకుండా ప్రశాంతే డైరెక్టర్ అని బాలయ్య కూడా తేల్చి పడేసాడు.ఒక రకంగా ఆ నిర్ణయం సంచలనం అని చెప్పవచ్చు.
ఎందుకంటే నందమూరి హీరోలు అంటేనే మాస్ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్.మరి ప్రశాంత్ ఏమో కంప్లీట్లీ డిఫరెంట్ డైరెక్టర్.
అందుకు ఆయన తెరకెక్కించిన గత చిత్రాలే ఉదాహరణ.లేటెస్ట్ గా వచ్చిన హనుమాన్( Hanuman ) లో మాస్ అంశాలు ఒక మాదిరిగా ఉన్నా కూడా భక్తి ఖాతాలోకే హనుమన్ వెళ్ళింది.
ప్రస్తుత పాన్ ఇండియా ట్రెండ్ ని బట్టి బాలయ్య నిర్ణయం కరెక్ట్ అని మెజారిటీ నందమూరి అభిమానులు అభిప్రాయం.ఇక ఇప్పుడు ఆ స్థాయిలోనే హీరోయిన్ ఎంపిక జరుగుతుందనే వార్తలు వస్తున్నాయి.
ఇక ఆ సంగతి పక్కన పెడితే మోక్షజ్ఞ మొదటి సినిమాలో హీరోయిన్ ఎవరు అన్న విషయం పై ఇప్పటికీ ఎన్నో రకాల వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.శ్రీ లీల హీరోయిన్గా నటించనుంది అంటూ వార్తలు వినిపించాయి.కానీ తాజాగా అందిన సమాచారం ప్రకారం.ఇందులో ఖుషి కపూర్ ( Khushi Kapoor ) హీరోయిన్ గా నటించనుందట.బాలయ్య తన కెరీర్ స్టార్టింగ్ నుంచి దాదాపుగా అందరికి హీరోయిన్లతో జోడి కట్టాడు.కానీ ఒక్క శ్రీదేవి తో మాత్రం స్క్రీన్ షేర్ చేసుకోలేదు.
అప్పట్లో చాలా మంది బాలయ్య, శ్రీదేవి కాంబో ట్రై చేసారు.కానీ సెట్ అవ్వలేదు.
బాలయ్య అభిమానులు కూడా ఆ ఇద్దరి కాంబోని వెండి తెర మీద చూడాలని ఎంతో ఆశపడ్డారు.శ్రీదేవి కూడా బాలయ్యతో చెయ్యకపోవడానికి ప్రత్యేక కారణాలు ఏమి లేవని గతంలో చెప్పుకొచ్చింది.
అదేవిధంగా జాన్వీ కపూర్ ప్రస్తుతం దేవర సినిమాలో ఎన్టీఆర్ సరసన నటిస్తున్న విషయం తెలిసిందే.జాన్వీ మొదటి తెలుగు సినిమా కూడా దేవరే.
సో అన్నదమ్ములిద్దరు అక్క చెల్లెళ్ల ని తెలుగు తెరకి పరిచయం చేసి శ్రీదేవి వారసురాల్లని తెలుగునాట నెంబర్ వన్ హీరోయిన్స్ గా ఎదిగే అవకాశం ఇచ్చినట్టే అవుతుందని కూడా అంటున్నారు.