ఇటీవల సౌత్ సినీ ఇండస్ట్రీకి ప్రకటించిన సౌత్ ఫిలింఫేర్ అవార్డులలో( South Film Fare Awards ) భాగంగా తెలుగు చిత్ర పరిశ్రమకు భారీ స్థాయిలో అవార్డులు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.ఇక ఈ అవార్డులలో భాగంగా నాచురల్ స్టార్ నాని( Nani ) నటించిన దసరా సినిమాకు( Dasara Movie ) వివిధ భాగాలలో ఏకంగా ఆరు అవార్డులు వచ్చాయి.
నాని కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.ఇక ఈ సినిమాలో ఉత్తమ నటుడిగా నాని ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు.
అలాగే ఉత్తమ నటిగా కీర్తి సురేష్( Keerthi Suresh ) సైతం అవార్డును సొంతం చేసుకున్నారు.
ఈ విధంగా దసరా సినిమాకు ఆరు అవార్డులు రావడంతో ఇతర సెలబ్రిటీలు దసరా సినిమా సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అలాగే ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు సొంతం చేసుకున్న నేచురల్ స్టార్ నానికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఈ క్రమంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం సోషల్ మీడియా వేదికగా నానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్ట్ చేశారు.
సోషల్ మీడియా వేదికగా నాని షేర్ చేసిన ఫోటోకి అల్లు అర్జున్( Allu Arjun ) రియాక్ట్ అవుతూ.కంగ్రాట్స్.దీనికి నువ్వు అర్హుడివి అని పోస్ట్ చేసాడు.
దీనికి నాని రిప్లై ఇస్తూ థాంక్యూ బన్నీ నేను కచ్చితంగా చెప్పగలను వచ్చే ఏడాది మీరు కూడా పుష్ప రూల్ తో బోలెడన్ని అవార్డులను ఇంటికి తీసుకెళ్తావు అంటూ అల్లు అర్జున్ చేసిన పోస్టుకు నాని రిప్లై ఇస్తూ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.పుష్ప సినిమాకు గాను ఎన్నో అవార్డులు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.
ఇక పుష్ప 2( Pushpa 2 ) సినిమా డిసెంబర్ ఆరో తేదీ రానున్న నేపథ్యంలో ఈ సినిమాపై ఇప్పటికే ఎన్నో అంచనాలు ఉన్నాయి.