వైరల్: అలా కునుకు తీసింది.. ఇలా గోల్డ్ మెడల్ కొట్టింది..

ప్రస్తుతం జరుగుతున్న ఒలింపిక్స్‌ లో ఉక్రెయిన్ మహిళా హై జంపర్ యారోస్లావా మహుచిఖ్ ( Jumper Yaroslava Mahuchikh )స్వర్ణ పతకం గెలిచిన విధానం అందిరిని ఆశ్చర్యపరుస్తుంది.ఇకపోతే జరిగిన మహిళల హై జంప్ ఫైనల్స్‌ పోటీలో 2.10 మీటర్లను క్లియర్ చేసి గోల్డ్ మెడల్ ( Gold Medal )ను ఖాతాలో వేసుకుంది.ఇక ఈ పోటీలో ఆస్ట్రేలియా దేశానికి చెందిన నికోలా ఒలిస్లేగర్స్ రెండో స్థానం సాధించి రజతం గెలుచుకోగా.

 Viral Got A Gold Medal Like This, Viral Video, Social Media, Olympic 2024, Paris-TeluguStop.com

ఆస్ట్రేలియా దేశాని చెందిన మరో మహిళా ఎలినల్ పాటర్‌స్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది.

ఇకపోతే గోల్డ్ మెడల్ గెలుచుకున్న యారోస్లావా మహుచిఖ్ ఫైనల్ లో జంప్ చేసే ముందు ఓ మంచి నిద్ర కునుకు తీసింది.ఫైనల్స్‌ లో తన పేరును ప్రకటించే వరకూ ఆమె తన బ్యాగ్‌పై సేద తీరిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.ఇక ఆమె పేరు ప్రకటించగానే.

మహుచిఖ్ నిద్రలో నుంచి లేచి నేరుగా వెళ్లి ఒక్కసారిగా హైజంప్ చేసింది.ఇంకేముంది దెబ్బకు గోల్డ్ మెడల్ కథలో పడింది.

ఒకపోతే., కునుకు తీసి గోల్డ్ మెడల్ను సాధించిన ఆమెపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఇకపోతే ఆమె కెరీర్‌లో ఇదే తొలి బంగారు పతకం.చివరిగా టోక్యో ఒలింపిక్స్‌( Tokyo Olympics ) లో 2 మీటర్ల ఎత్తును క్లియర్ చేసి అక్కడ రజత పతకం ఖాతాలో వేసుకుంది.

ఇకపోతే మ్యాచ్ లో ఆటకు ముందు ఎలాంటి ఒత్తిడికి గురి కాకూడదనే తాను రిలాక్స్ అయ్యేందుకే కునుకు తీసానని గెలిచాక యారోస్లోవా మహుచిఖ్ చెప్పుకొచ్చింది.ఇలాంటి విధానాన్ని 2018లో యూత్ ఒలింపిక్ గేమ్స్‌ నుండి ఇలానే చేస్తునట్లు ఆవిడ తెలిపింది.ఇలా కాకపోతే ఒక్కక్కసారి అంకెలను లెక్కిస్తానని.మరికొన్నిసార్లయితే.గట్టిగా ఊపిరి పీల్చుకుంటానంటూ తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube