ఇటీవల కాలంలో తెలుగు సినిమా సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ప్రశాంత్ వర్మ( Prashant Verma ).హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో మంచి పాపులారీటీ సంపాదించుకున్నారు ప్రశాంత్ వర్మ.
ఇక హనుమాన్ సినిమా( Hanuman movie ) ఆయన పేరు మారుమోగిన విషయం తెలిసిందే.ఇక ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న ప్రశాంత వర్మ ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ ను తెరకెక్కించే పనిలో పడ్డారు.
ఇకపోతే ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఆంగ్లం మీడియాతో ముచ్చటించిన ప్రశాంత వర్మ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.సినిమాటిక్ యూనివర్స్ కోసం నేను కొందరు బాలీవుడ్ స్టార్స్ ను కలిశాను.
వారితో నా ఆలోచనలను పంచుకున్నాను.ఇందులో వారు కచ్చితంగా భాగం అవుతారు.
కాకపోతే కాస్త సమయం పడుతుంది.ఎందుకంటే ఈ సినిమాటిక్ యూనివర్స్ ఇంకా ప్రారంభదశలోనే ఉంది.
జై హనుమాన్ ( Jai Hanuman )పనులు శరవేగంగా జరుగుతున్నాయి.హనుమాన్ రూ.100 కోట్లు మాత్రమే వసూలు చేసుంటే మేము దాని సీక్వెల్ ను ఈపాటికి ఎప్పుడో విడుదల చేసేవాళ్లం.

కానీ ఆ చిత్రం మా అంచనాలకు మించి కలెక్షన్లు సొంతం చేసుకుంది.దీంతో మా బాధ్యత కూడా పెరిగింది అని అన్నారు ప్రశాంత్ వర్మ.జై హనుమాన్ కోసం ఎంతోమంది కష్టపడుతున్నారు.
స్క్రిప్ట్ వర్క్ పనులు జరుగుతున్నాయి.మీ అంచనాలను అందుకునేలా సినిమా ఉంటుంది.
అభిమానులు స్క్రీన్‌పై ఏ అంశాలనైతే చూడాలనుకుంటున్నారో వాటిని మేము కచ్చితంగా చూపిస్తాము.నటీనటుల ఎంపిక కూడా దాదాపు పూర్తయింది.
హనుమాన్ సమయంలో మొదట షూటింగ్ చేసి తర్వాత వీఎఫ్‌ఎక్స్ పనులు ప్రారంభించాము.కానీ, దీని సీక్వెల్‌కు మాత్రం వీఎఫ్‌ఎక్స్ పనులు ముందే సిద్ధం చేస్తున్నాము.
దీనివల్ల పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎక్కువ సమయం పట్టవు.దీని షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు అంటూ జై హనుమాన్ అప్‌డేట్‌ను పంచుకున్నారు ప్రశాంత్ వర్మ.