సినిమా ఇండస్ట్రీ అనేది ఒక సముద్రం లాంటిది.నిజానికి సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని అయినప్పటికీ కొంతమంది మాత్రం కష్టంతో ముందడుగు వేసి చాలా వరకు కష్టపడి హై రేంజ్ లోకి వెళ్లే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు.
మరి ఇలాంటి క్రమంలోనే వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా కూడా ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను పెంచుతూ ఉంటాయి.ఇక ఇలాంటి క్రమంలోనే అక్కినేని నాగా చైతన్య( NagaChaitanya ) కూడా హీరోగా ఇప్పుడిప్పుడే చాలా మంచి సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు.
ఇక ఇప్పుడు ఆయన చందు మొండేటి(C handoo Mondeti ) దర్శకత్వంలో తండేల్ అనే సినిమా చేస్తున్నాడు.
ఇక ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించాలనే లక్ష్యాన్ని పెట్టుకుని ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తుంది.అయితే ఈ సినిమా ద్వారా మంచి సక్సెస్ కనుక వచ్చినట్లయితే పాన్ ఇండియాలో కూడా ఆయన స్టార్ హీరోగా కొనసాగుతాడు.నిజానికి అక్కినేని ఫ్యామిలీలో ఎవరు కూడా పాన్ ఇండియా స్టార్లు గా ఎదగలేకపోయారు.
కానీ మొత్తానికైతే నాగ చైతన్య మాత్రం ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే పాన్ ఇండియా లో స్టార్ హీరోగా ఎడగడమే కాకుండా తన మార్కెట్ ను కూడా భారీగా విస్తరించుకున్న వాడు అవుతాడు.
అందుకే తను ఈ సినిమా మీద స్పెషల్ ఫోకస్ పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది.చందు మొండేటి ఏది చెబితే అది చేస్తూ సినిమా సక్సెస్ లో తను కూడా కీలకపాత్ర వహించాలని చూస్తున్నాడు.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో తను నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోవడమే కాకుండా భారీ సక్సెస్ ని మూటగట్టుకునే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది.
చూడాలి మరి నాగచైతన్య అక్కినేని ఫ్యామిలీ నుంచి మొదటి పాన్ ఇండియా స్టార్ గా ఎదుగుతాడా లేదా అనేది…