బాలీవుడ్ సినీ నటి అలియా భట్ ( Alia bhatt ) ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.డైరెక్టర్ మహేష్ భట్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె ఇది వరకు కేవలం బాలీవుడ్ సినిమాలకు మాత్రమే పరిమితం అయ్యారు.
అయితే రాజమౌళి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన RRR సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.ఈ సినిమా ద్వారా తెలుగులో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న అలియా అనంతరం ఆమె నటించిన సినిమాలన్నీ కూడా తెలుగులో విడుదల అవుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నాయి.
ఇక ఇటీవల అలియా నటించిన జిగ్రా ( Jigra ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈమె వరస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేశారు.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తనకు ఉన్నటువంటి ఒక సమస్య గురించి ఈమె ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.తనకు ప్రతిక్షణం చాలా ఆందోళనకరంగా ఉంటుందని తెలిపారు.
ముఖ్యంగా నాకు మారితే రాహా ( Raha ) ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసే సమయంలో ఎంతో ఆందోళన చెందామని తెలిపారు.
నాకు మా కూతురు ఫోటోని షేర్ చేయడానికి నాకు ఆసక్తి ఉండేది కాదు.తన కుమార్తెతో కలిసి దిగిన ఫోటోనే ఇంస్టాగ్రామ్ లో షేర్ చేద్దామని రణబీర్ ( Ranabir ) అన్నప్పుడు చాలా కంగారు పడ్డాను.ప్రతిక్షణం నేను ఎంతో ఆందోళనకు గురవుతాను కొన్నిసార్లు అది తీవ్రతరం అవుతుంది.
రణబీర్ నా సమస్యను అర్థం చేసుకొని ప్రవర్తిస్తూ ఉంటాడంటూ అలియా చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక ఈమె ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలు మాత్రమే కాకుండా హాలీవుడ్ సినిమాలలో కూడా అవకాశాలను అందుకుంటున్నారు.
ఇక తెలుగులో కూడా ఈమెకు ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి.