ఏపీ ప్రభుత్వంలో కీలక భాగస్వామి గా ఉన్న జనసేన పార్టీకి( Janasena ) టిడిపి బాగానే ప్రాధాన్యం ఇస్తుంది.పవన్ కు( Pawan Kalyan ) అన్ని విషయాలలోను స్వేచ్ఛను కల్పిస్తోంది .
ఇదే విధంగా కేంద్ర అధికార పార్టీ బిజెపి( BJP ) సైతం పవన్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది.పవన్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది.
భవిష్యత్తులో రాజకీయంగా పవన్ కళ్యాణ్ కీలక కాబోతుండడం తో పవన్ అండదండలు తమకు ఉండేలా బిజెపి జాగ్రత్తలు తీసుకుంటుంది .ఈ మేరకు ఏపీలో పవన్ నిర్వహిస్తున్న శాఖలకు సంబంధించి భారీగా నిధులు విడుదల చేస్తూ పవన్ కు తాము ఏ స్థాయిలో ప్రాధాన్య ఇస్తున్నామనేది చాటి చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది.పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖకు ఎక్కువ నిధుల కేటాయింపు చేస్తోంది.

15 ఆర్థిక సంఘం నిధులు కింద తొలి విడతగా ఏపీకి 593 కోట్ల రూపాయలను విడుదల చేసింది.ఈ నిధులతో పంచాయతీలు , మండల పరిషత్ , జిల్లా పరిషత్ లకు నిధులు కేటాయించాలని పేర్కొంది .గ్రామీణ అభివృద్ధి( Rural Development ) లక్ష్యంగా పవన్ కళ్యాణ్ పనిచేస్తుండడంతో, ఆయనకు ఈ నిధులు ఉపయోగపడనున్నాయి.గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఈ నిధులను కేటాయిస్తుండడం తో పవన్ కు జనాల్లో మరింతగా ఆదరణ పెరిగే అవకాశం ఉంది.పవన్ కళ్యాణ్ కు రాజకీయంగా అండగా నిలబడేందుకు , ప్రజల మద్దతు ఆయనకు మరింత పెరిగే విధంగా ఈ నిధులు ఉపయోగపధనుండడం తో పవన్ తో పాటు కూటమి ప్రభుత్వానికి కూడా ఇది లాభమే.
గ్రామాల్లో అభివృద్ధి జరిగితే అది తన హయాంలోనే జరిగిందని చెప్పుకునేందుకు చంద్రబాబుకు వీలుంటుంది.

పవన్ ఒక్కరికే కాకుండా తమ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని, రాజకీయంగా ఇది తమకు మంచే చేస్తుంది అని చంద్రబాబు( Chandrababu ) అభిప్రాయపడుతున్నారట .అయితే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఎటువంటి రాజకీయ ప్రయోజనం లేకుండా ఏ పని చేయదని , పవన్ రానున్న రోజుల్లో తమకు బాగా ఉపయోగపడతారని అంచనాతోనే ఆయనకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే విధంగా బిజెపి పెద్దలు వ్యవహరిస్తున్నట్లుగా అర్థం అవుతుంది.ప్రస్తుతం ఎన్డీఏ లో కీలక భాగస్వామిగా చంద్రబాబు ఉన్నారు.
ఆయన మద్దతుతోనే ఢిల్లీలో పాలన నడుస్తోంది.ఏ క్షణంలోనైనా ఆయన మద్దతు ఉపసంహరించుకుంటే రాజకీయంగా బిజెపి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే.
అందుకే కేంద్రం నిధుల విషయంలో ఏపీకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడమూ మరో కారణ గా అర్ధం అవుతోంది.