దళపతి విజయ్( Vijay Thalapathy ) ప్రస్తుతం ఒకవైపు రాజకీయాలలో యాక్టివ్ గా ఉంటూనే మరొకవైపు సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఇక సినిమాల పరంగా చూసుకుంటే విజయ్ ఇప్పుడు తన కెరియర్ లో ఆఖరి సినిమాను హెచ్ వినోద్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే.
తన 69వ సినిమాను చాలా గ్రాండ్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు విజయ్.ఈ చిత్రంకి ముందు విజయ్ చేసిన సినిమాల్లో రెండు సినిమాలకి సీక్వెల్స్ అయితే ఉన్నాయి.
మరి వాటిలో క్రేజీ సీక్వెల్ చిత్రం లియో 2( Leo 2 ) కూడా ఒకటి.

దర్శకుడు లోకేష్ కనగరాజ్( Lokesh Kanagaraj ) తన సినిమాటిక్ యూనివర్స్ లో చేసిన భారీ సినిమా.కాగా దీనికి పార్ట్ 2 కూడా ఉందని తాను అనౌన్స్ చేయనున్నాడట.ఇకపోతే రీసెంట్ గా జరిగిన మీడియా ఇంటరాక్షన్ లో పార్ట్ 2 కోసం ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు.
ఒకవేళ తనకి పార్ట్ 2 చేసే అవకాశం వస్తే దానికి పార్తిబన్( Parthiban ) అనే టైటిల్ ని లాక్ చేసినట్టుగా అనౌన్స్ చేసాడు లోకేశ్ కనగరాజ్.అయితే విజయ్ ఇపుడు మొదలు పెట్టిన సినిమా తర్వాత సినిమాలు ఆపేస్తున్నట్టుగా తెలిపాడు.
అందుకే ఒకవేళ ఛాన్స్ వస్తే అన్నట్టుగా లోకేష్ క్లారిటీ ఇచ్చాడు.