టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు చిరంజీవి( Chiranjeevi ) ఒకరు.ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు.
సినిమాలలో కొనసాగుతూ వేల కోట్లు సంపాదించినప్పటికీ బయట మాత్రం చాలా సింపుల్ గా కనిపిస్తూ ఉంటారు.ఇకపోతే ఇటీవల చిరంజీవి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని(CM Chandrababu Naidu ) కలిశారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక చిరంజీవి ఉన్నఫలంగా చంద్రబాబు నాయుడుని కలవడానికి కూడా కారణం లేకపోలేదు.ఇటీవల విజయవాడకు పెద్ద ఎత్తున వరదలు( Floods ) రావడంతో ఎంతోమంది సినిమా సెలబ్రిటీలు పెద్ద ఎత్తున విరాళాలను ప్రకటించారు.ఇక చిరంజీవి కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఏకంగా కోటి రూపాయల విరాళం అందించారు ఈ క్రమంలోనే ఆ చెక్ అందించడం కోసం సీఎం చంద్రబాబు నాయుడుని కలిశారు.
ఇలా చంద్రబాబు నాయుడుని కలిసిన సమయంలో చిరంజీవి ధరించిన షూస్( Chiranjeevi Shoes ) అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ఈ క్రమంలోనే చిరంజీవి ధరించిన ఈ షూ ఖరీదు ఎంత అని ఆరా తీయడం మొదలు పెట్టారు.చిరంజీవి వేసుకున్న షూ గూచ్చి( Gucci )బ్రాండ్ కు చెందినవి.ఇవి ముందు నుండి షూ లాగా, వెనుక నుండి స్లిప్పర్ లాగా అనిపిస్తాయి.
వీటిని Mules అంటారు.చిరు కాలికి ఉన్న ఈ షూస్ ధర అక్షరాల లక్ష రూపాయలను తెలిసి అందరూ షాక్ అవుతున్నారు.
చూడటానికి సింపుల్ గా ఉన్న వీటి ధర తెలిసి షాక్ అవుతున్నారు.ఈయన చెప్పుల ధరతో మధ్య తరగతి వాళ్లు ఏడాది పాటు హ్యాపీగా బ్రతకొచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.