తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే.ప్రస్తుతం తమదైన రీతిలో దర్శక నిర్మాతలు అందరు వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు.
ఇప్పుడు సినిమాల మధ్య పోటీ అనేది భారీగా పెరిగిపోయింది.ఒక సినిమా కంటెంట్ బాగుంటే ఆటోమేటిగ్గా సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాయి.
ఇక అదే రీతిలో ఈ సంక్రాంతికి( Sankranti ) స్టార్ హీరోలు తమ సినిమాలతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నారు.ఇక అందులో భాగంగానే రామ్ చరణ్ గేమ్ చేంజర్( Game Changer ) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటే బాలయ్య( Balayya ) కూడా తన 109వ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు.
ఇక అలాగే వెంకి, అనిల్ రావిపూడి( Venkatesh Anil Ravipudi ) కాంబోలో వస్తున్న మూడోవ సినిమా కూడా ఈ సంక్రాంతి బరిలో నిలుస్తుంది… ఇక వీటితో పాటుగా సుమంత్( Sumanth ) హీరోగా వస్తున్న ‘మహేంద్ర గిరి వారాహి’( Mahendragiri Varahi ) సినిమా కూడా ప్రేక్షకుల మన్ననలు పొందడానికి రెడీ అవుతుంది.నిజానికి ఈ సినిమాని దర్శకుడు సంతోష్ జాగర్లపూడి చాలా కేర్ ఫుల్ గా చిత్రీకరిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది.
అయితే సంక్రాంతి బరిలో ఈ సినిమా నిలవడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే ఫెస్టివల్ సీజన్ లో అయితే సినిమా ప్రతి ప్రేక్షకుడికి రీచ్ అవుతుందనే ఉద్దేశ్యం తోనే ఈ సినిమాను సంక్రాంతి బరిలో నిలుపుతున్నట్టుగా తెలుస్తోంది.

ఇక రీసెంట్ గానే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా హైదరాబాద్ లో కూడా కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించారు.ఇక ఇప్పుడు హంపి, అస్సాం లలో భారీ షెడ్యూల్స్ ని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పటివరకు ఈ సినిమా అవుట్ పుట్ చాలా అద్భుతంగా వచ్చిందని సినిమా మేకర్స్ కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు.
ఇక ఇప్పుడు చేయబోయే షెడ్యూల్స్ కూడా చాలా పకడ్బందీ ప్రణాళికతో రూపొందించి వాళ్లు ఏమైతే అనుకున్నారో ఆ కంటెంట్ ని తీసుకురావడానికి భారీ ప్రణాళికలు రూపొందిస్తున్నారు.ఇక మొత్తానికైతే దర్శకుడు సంతోష్ జాగర్లపూడి ఈ సినిమాతో ఒక భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోబోతున్నాడు అనేది చాలా క్లియర్ కట్ గా అర్థమవుతుంది.
ఇక ఈ సినిమా దైవభక్తితో సాగే సినిమా కావడం అది కూడా అమ్మవారి ఆశీస్సులతో సినిమా తెరకెక్కుతూ ఉండడం వల్ల పండుగ సీజన్ ని చాలా వరకు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు.

నిజానికి ఈ సినిమా కంటెంట్ కూడా ప్రేక్షకుడికి చాలా ఈజీగా కనెక్ట్ అవుతుందని వాళ్లు భావిస్తున్నారు.దానివల్లే స్టార్ హీరోల నుంచి ఎంత పోటీ ఉన్న కూడా ఈ సినిమాని సంక్రాంతి కానుకగా ప్రేక్షకులు ముందుకు తీసుకురావడానికి వాళ్ళు భారీ ప్రణాళికలైతే చేస్తున్నారు… ఇక ఇప్పటికే దర్శకుడు సంతోష్ జాగర్లపూడి( Santosh Jagarlapudi ) ఈ సినిమా మీద భారీ ఎఫర్ట్ పెట్టి తన కాలు కి పెద్ద గాయం అయినప్పటికి తన ప్రాణాలకు తెగించి మరి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు.అలాగే ప్రొడ్యూసర్ మధు కలిపి కూడా దర్శకుడు ఏదైతే కావాలని అనుకుంటున్నాడో దాన్ని అందించడానికి తన స్వాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాడు.
ఇక వీళ్ళిద్దరి కాంబినేషన్ సరిగ్గా సెట్ అవ్వడం వల్లే ఈ సినిమా భారీగా చిత్రీకరించబడుతుంది అంటూ సినిమా యూనిట్ నుంచి ఒక న్యూస్ కూడా బయటికి వస్తుంది.ఇక ఈ సినిమాలో ముగ్గురు పాన్ ఇండియా స్టార్స్ కూడా నటిస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక వాళ్లని సినిమా చూసేటప్పుడే రివిల్ చేయాలనే ఉద్దేశ్యంతో మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది… మరి అంత మంది పెద్ద హీరోలతో పోటీపడి సినిమాను రిలీజ్ చేసేంత ధైర్యం వచ్చిందంటే నిజంగా ఆ సినిమా కంటెంట్ లోనే దమ్ముందని మనం అర్థం చేసుకోవచ్చు…
.