తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల కు( Local Body Elections ) సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం మొదట్లో హడావుడి చేసినా, ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేనట్టుగానే కనిపిస్తోంది.పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తరువాత స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించి పూర్తిగా పరిపాలనపై దృష్టి సారించాలని సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) భావించినా, మారిన పరిస్థితుల నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు మరికొంత కాలం వాయిదా పడితేనే మంచిదనే అభిప్రాయంతో రేవంత్ రెడ్డి ఉన్నారట.ప్రస్తుతం కుల గణన తో పాటు, హైడ్రా, మూసినది ప్రక్షాళన వంటి అంశాలపై ప్రధానంగా ఫోకస్ చేయడంతో స్థానిక సంస్థల ఎన్నికలను ఇప్పట్లో నిర్వహించే ఆలోచనలో రేవంత్ రెడ్డి లేరట.2019 జనవరిలో గ్రామపంచాయతీలకు , అదే ఏడాది మే లో జిల్లా పరిషత్ మండల పరిషత్ లకు ఎన్నికలు జరిగాయి.

స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల పదవీకాలం పూర్తి కావడంతో ప్రత్యేక అధికారుల పాలనను తీసుకువచ్చారు.అయితే బీసీ కులగలను కోసం సామాజిక , రాజకీయ, ఆర్థిక సర్వే కోసం జీవో నెంబర్ 13 ను విడుదల చేశారు.ఈ సర్వే రెండు నెలల పాటు జరుగుతుంది. కులగనన( Caste Census ) పూర్తయ్యకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే మంచిదనే ఆలోచనతో రేవంత్ రెడ్డి ఉన్నారట.
ఈ లెక్కన చూసుకుంటే స్థానిక సంస్థల ఎన్నికలు మూడు నాలుగు నెలల తర్వాతే నిర్వహించే అవకాశం కనిపిస్తోంది.గ్రామస్థాయిలో కాంగ్రెస్( Congress ) పట్టు పెంచుకునే విధంగా ఇప్పటికే ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు.

ఈ కమిటీల ద్వారానే ఇళ్లను మంజూరు చేయనున్నారు.అలాగే ఇతర పథకాలకు ఇందిరమ్మ కమిటీలు కీలకపాత్ర పోషించే విధంగా రూపొందించారు.ఇవన్నీ తమకు కలిసి వస్తాయని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది.మరోవైపు చూస్తే ఏడాదికి పైగా మున్సిపాలిటీ ఎన్నికలకు సమయం ఉంది.స్థానిక సంస్థల ఎన్నికలను మరికొంత కాలం వాయిదా వేస్తే మున్సిపల్ ఎన్నికల తో పాటు, స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తే ఎలా ఉంటుందనే దానిపైన ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.