ఆ పదిమంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారా ? ఉప ఎన్నికలు ఖాయమేనా ? 

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఉప ఎన్నికల( By-elections ) అంశం చర్చనీయాంశంగా మారింది.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలిచి,  ఆ తరువాత కాంగ్రెస్( Congress ) లో చేరిన పదిమంది ఎమ్మెల్యేల భవిష్యత్తు ఏమిటనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

 Will Those Ten Mlas Resign? Are By-elections Certain , Brs, Bjp, Congress, Tela-TeluguStop.com

ఈ పదిమందిలో మొదట కాంగ్రెస్ లో  చేరిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై బీఆర్ఎస్ కోర్టుకు వెళ్లింది.ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ మారి 90 రోజులు పూర్తయిన నేపథ్యంలో,  తెలంగాణ హైకోర్టు కూడా వీరి విషయంలో సీరియస్ యాక్షన్ తీసుకుంది .నెలరోజుల్లోగా ఈ ముగ్గురిపై తెలంగాణ స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు ( Telangana High Court )సూచించింది. 

Telugu Congress, Congress Bjp, Danam Nagender, Kadiyam Srihari, Telangana-Politi

ఒకవేళ ఈ ముగ్గురు నేతలపై చర్యలు తీసుకోకపోతే హైకోర్టు  తగిన చర్యలు తీసుకుంటాము అని చెప్పింది.  దీంతో ఈ ముగ్గురు పదవులకు గండి ఏర్పడింది.  వీరితో పాటు,  బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేల పరిస్థితి దాదాపు ఇదేవిధంగా ఉంది.

వారు కూడా కాంగ్రెస్ లో చేరి దాదాపు 90 రోజులు దగ్గరకు అవుతుంది.  వీరిపైన హైకోర్టు సీరియస్ గానే వ్యవహరించే అవకాశం ఉంది .ఈ నేపథ్యంలో పదిమంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్తే .కోర్టు చర్యలు తీసుకునే వరకు వేచి చూస్తే వాళ్ల రాజకీయ భవిష్యత్ గందరగోళం లో పడే ఛాన్స్ కనిపిస్తోంది.

Telugu Congress, Congress Bjp, Danam Nagender, Kadiyam Srihari, Telangana-Politi

పదిమంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి.ఇక బీఆర్ఎస్ కూడా ఉప ఎన్నికలు  కచ్చితంగా వస్తాయని బలంగా నమ్ముతుంది.ముందుగానే అభ్యర్థుల ఎంపికైన ఆ పార్టీ దృష్టి పెట్టింది.ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేసింది.ప్రస్తుతం పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ తీసుకునే నిర్ణయంపైనే అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube