యంగ్ టైగర్ ఎన్టీఆర్( NTR )!త్వరలోనే దేవర సినిమా(Devara Movie) ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
ఇక ఎన్టీఆర్ సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడటమే కాకుండా ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ఎన్టీఆర్ చివరిగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
అయితే ఇందులో రామ్ చరణ్( Ramcharan ) కూడా నటించిన సంగతి తెలిసిందే.

ఇక ఎన్టీఆర్ సోలోగా అరవింద సమేత సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా తర్వాత దేవర సినిమా ద్వారా రాబోతున్నారు.అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ముంబైలో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ చేసిన కామెంట్స్ అభిమానులను కాస్త ఆందోళనకు గురి చేస్తున్నాయి.ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ చూస్తే కనుక దేవర కథ ఏంటో ఇక్కడే డైరెక్టర్ చూపించారు ఇదే కనుక అలాగే కొనసాగితే దేవర సినిమా కష్టాలలో పడినట్లేనని అభిమానులు ఆందోళన పడుతున్నారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ ఆరు సంవత్సరాల తర్వాత సోలో హీరోగా మీ ముందుకు రాబోతున్న నేపథ్యంలో కాస్త నర్వస్ గా ఉందని తెలిపారు.అయితే ఈ సినిమా చివరి 40 నిమిషాలు ప్రేక్షకులకు పూనకాలు తెప్పించే లాగా ఉందని,దానికోసం తాను ఈగర్‌గా వెయిట్ చేస్తున్నానని చెప్పారు.ఆసీన్లని దర్శకుడు కొరటాల శివ( Koratala Shiva ) అద్భుతంగా తెరకెక్కించారని, విజువల్స్ వండర్‌గా ఉంటాయని, అదొక ట్రీట్‌లా ఉంటుందంటూ ఎన్టీఆర్ చేసిన ఈ కామెంట్స్ సినిమాపై మరి కాస్త అంచనాలను పెంచాయి.మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు అనుగుణంగా ఉంటుందా లేదా అనే విషయం అభిమానులలో కాస్త ఆందోళనను కలిగిస్తుంది
.