ఆరేళ్ల తర్వాత వస్తున్నా నర్వెస్ గానే ఉంది… షాకింగ్ కామెంట్స్ చేసిన ఎన్టీఆర్!
TeluguStop.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్( NTR )!త్వరలోనే దేవర సినిమా(Devara Movie) ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
ఇక ఎన్టీఆర్ సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడటమే కాకుండా ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఎన్టీఆర్ చివరిగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
అయితే ఇందులో రామ్ చరణ్( Ramcharan ) కూడా నటించిన సంగతి తెలిసిందే.
"""/" /
ఇక ఎన్టీఆర్ సోలోగా అరవింద సమేత సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా తర్వాత దేవర సినిమా ద్వారా రాబోతున్నారు.అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ముంబైలో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ చేసిన కామెంట్స్ అభిమానులను కాస్త ఆందోళనకు గురి చేస్తున్నాయి.
ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ చూస్తే కనుక దేవర కథ ఏంటో ఇక్కడే డైరెక్టర్ చూపించారు ఇదే కనుక అలాగే కొనసాగితే దేవర సినిమా కష్టాలలో పడినట్లేనని అభిమానులు ఆందోళన పడుతున్నారు.
"""/" /
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ ఆరు సంవత్సరాల తర్వాత సోలో హీరోగా మీ ముందుకు రాబోతున్న నేపథ్యంలో కాస్త నర్వస్ గా ఉందని తెలిపారు.
అయితే ఈ సినిమా చివరి 40 నిమిషాలు ప్రేక్షకులకు పూనకాలు తెప్పించే లాగా ఉందని,దానికోసం తాను ఈగర్‌గా వెయిట్ చేస్తున్నానని చెప్పారు.
ఆసీన్లని దర్శకుడు కొరటాల శివ( Koratala Shiva ) అద్భుతంగా తెరకెక్కించారని, విజువల్స్ వండర్‌గా ఉంటాయని, అదొక ట్రీట్‌లా ఉంటుందంటూ ఎన్టీఆర్ చేసిన ఈ కామెంట్స్ సినిమాపై మరి కాస్త అంచనాలను పెంచాయి.
మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు అనుగుణంగా ఉంటుందా లేదా అనే విషయం అభిమానులలో కాస్త ఆందోళనను కలిగిస్తుంది.
సంక్రాంతి బరిలో రామ్ చరణ్, వెంకటేష్, బాలయ్య సినిమాలకు పోటీ గా వస్తున్న ‘మహేంద్ర గిరి వారాహి’…