తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే ముందుగా అందరికీ మెగా ఫ్యామిలీ( Mega Family ) గుర్తొస్తుంది.ప్రస్తుతం వాళ్లు మాత్రమే భారీ సినిమాలను చేస్తూ భారీ సకేస్ లను అందుకుంటూ ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా సంపాదించుకుంటున్నారు.
మరి ఇలాంటి క్రమంలోనే మెగా ఫ్యామిలీ లో ఉన్న స్టార్ హీరోలందరు వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు.ఇక ఇదిలా ఉంటే నాగబాబు కొడుకు అయిన వరుణ్ తేజ్( Varun Tej ) మాత్రం సక్సెస్ లు కొట్టడంలో చాలా వరకు వెనకబడిపోయాడు.
కెరియర్ మొదట్లో తొలిప్రేమ, ఫిదా లాంటి సినిమాలతో మంచి విజయాలను అందుకున్న ఆయన ఇప్పుడు మాత్రం చేసిన సినిమాలు చేసినట్టుగా ఫ్లాప్ అవుతున్నాయి.మరి ఎందుకు ఆయన ఇలాంటి సినిమాలను చేస్తున్నాడు.ఒక మంచి కథతో సినిమా చేసి సూపర్ సక్సెస్ సాధించవచ్చు కదా అంటూ చాలామంది ఆయన విషయంలో వాళ్ళ అభిప్రాయాలను అయితే తెలియజేస్తున్నారు.ఇక మొత్తానికైతే ఆయన ఎక్స్పెరిమెంటల్ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నప్పటికీ దర్శకుల నిర్లక్ష్యం వల్లే ఆ సినిమాలు ప్లాప్ అవుతున్నాయి.
ఒక మంచి కథను ఎక్స్ట్రార్డినరీగా డైరెక్షన్ చేస్తే మాత్రం ఆ కథకి ఒక ప్రాణం వస్తుంది.అలాగే సినిమా కూడా నిలబడుతుందనే చెప్పాలి.అలా కాకుండా ఇష్టం వచ్చిన కథతో ఇష్టం వచ్చినట్టుగా సినిమాలు చేసుకుంటూ వెళ్తే మాత్రం ఫైనల్ గా మిగిలేది ఫ్లాప్ సినిమాలే అనేది గుర్తుపెట్టుకోవాలి.ఇక ఇప్పటికైనా వరుణ్ తేజ్ కొంచెం జాగ్రత్త పడి సక్సెస్ ఫుల్ కథలను ఎంచుకొని సక్సెస్ ఫుల్ డైరెక్టర్లకి అవకాశం ఇస్తూ ముందుకు సాగితే బాగుంటుందని పలువురు సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు… ఇక ప్రస్తుతం మెగా ఫ్యామిలీ లో చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ లాంటి ముగ్గురు స్టార్ హీరోలు ఉండడం విశేషం…
.