టాలీవుడ్ టాప్ 5 ఆడియో రైట్స్ ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే

సినిమాకు ప్రాణం పాటలు.అందుకే సంగీతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు దర్శకుడు.

 Tollywood Movies Top 5 Audio Rights Details, Tollywood Audio Rights, Rrr, Kgf Ch-TeluguStop.com

సినిమాలో పాటలు ఎంత బాగా జనాలను ఆకట్టుకుంటే సినిమా అంత బాగా హిట్ అవుతుందని సినీ జనాలు నమ్ముతారు.అంతేకాదు.

ఒక్కోసారి కేవలం పాటలతోనే సినిమాలు హిట్ అయిన సందర్భాలున్నాయి.పాటల కోసమే జనాలు సినిమాలు చూసిన సందర్భాలూ ఉన్నాయి.

ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాలు, పాన్ ఇండియా సినిమాల విషయంలోనూ దర్శకుడు సంగీతం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.సంగీతంతో జనాలను ఆకట్టుకునేలా జాగ్రత్త పడుతున్నారు.

అందుకే ఆయా సినిమాల ఆడియో రైట్స్ కూడా రికార్డు స్థాయి ధరలో అమ్ముడు అవుతున్నాయి.కోట్ల రూపాయలు పెట్టి ఆయా మ్యూజిక్ సంస్థలు పలు పాన్ ఇండియా సినిమాల మ్యూజిక్ రైట్స్ దక్కించుకుంటున్నాయి.

ఇంతకీ తెలుగులో భారీ ధర పలికిన ఆడియో రైట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆసక్తి కలిగిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్.

ఈ సినిమా ప్రస్తుతం చివరి దశలో ఉంది.ఎన్టీఆర్, రాంచరణ్ మీద షూట్ చేయాల్సిన పాట ఒక్కటే పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాకు సంబంధించిన మూవీ థ్రియేట్రికల్, ఓటీటీ రైట్స్ భారతీయ సినిమా చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయాయి.తాజాగా ఈ సినిమా ఆడియో రైట్స్ కూడా భారీ స్థాయిలో ధర పలికాయి.ఈ సినిమా ఆడియో రైట్స్ రూ.26 కోట్లుకు అమ్ముడైనట్టు సమాచారం అందుతోంది.బాహుబలి ఆడియో రైట్స్ తీసుకున్న లహరి మ్యూజిక్ ఆర్ఆర్ఆర్ ఆడియో రైట్స్ ను దక్కించుకున్నట్లు తెలుస్తోంది.తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోని ఆర్ఆర్ఆర్ ఆడియో రైట్స్ ను ఈ సంస్థ కొనుగోలు చేసింది.

Telugu Crore Rupees, Bahubali, Kgf Chapter, Kollywood, Pan Indai, Prabhas Sahoo,

అటు ఇప్పటి వరకు రికార్డు ధర పొందిన టాప్ 5 ఆడియో రైట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.
1.ఆర్ ఆర్ ఆర్ మ్యూజిక్ రైట్స్ రూ.26 కోట్లు
2.ప్రభాస్ సాహో రూ.22 కోట్లు
3.బాహుబలి-2 రూ.10 కోట్లు
4.సైరా నరసింహా రెడ్డి రూ.10 కోట్లు
5.KGF చాప్టర్-2 రూ.7.2 కోట్లు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube