ఒక సినిమా చేయాలంటే దాని వెనుక చాలామంది కష్టం ఉంటుంది.అలాంటి కొన్ని వేలమంది కష్టపడితే ఒక సినిమా అనేది మనకు థియేటర్ లో కనిపిస్తుంది.
మరి ఇలాంటి ఒక సందర్భంలో ఇప్పుడున్న దర్శకులు ఒక సినిమాని సెట్స్ మీద తీసుకెళ్లడానికి నానా రకాల కష్టాలను పడాల్సి ఉంటుంది… ఇక అందులో భాగంగానే ఇక్కడ కొందరికి సక్సెస్ లు వస్తే మరి కొందరికి ఫెయిల్యూర్స్ వస్తుంటాయి.ఇక ఇదిలా ఉంటే మొదట్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ ఇండస్ట్రీలో నిలబడడానికి ప్రయత్నం చేసిన బండ్ల గణే( Bandla Ganesh )ష్ ఆ తర్వాత ప్రొడ్యూసర్ గా మారి గబ్బర్ సింగ్ లాంటి ఒక బ్లాక్ బాస్టర్ సక్సెస్ ఫుల్ సినిమా చేసిన విషయం మనకు తెలిసిందే…
అయితే ఆయన కెరియర్ లో ఆయన చేసిన ముగ్గురు స్టార్ హీరోలతో చేసిన మూడు సినిమాల్లో కూడా ఒకే హీరోయిన్ ను రిపీట్ చేశాడు.ఇక దాంతో ఆ మూడు సినిమాల్లో ఆమెనే రప్ట్ చేయడానికి కారణం ఏంటి? అంటూ అప్పట్లో చాలా వార్తలైతే వచ్చాయి.ఇంతకీ అవి ఏ సినిమాలు ఆ హీరోయిన్ ఎవరు అనేది ఒకసారి మనం తెలుసుకుందాం…
బండ్ల గణేష్ ప్రొడ్యూసర్ గా ఎన్టీయార్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వం లో వచ్చిన ‘బాద్షా’ సినిమా(Baadshah )లో కాజల్ అగర్వాల్ ను హీరోయిన్ గా తీసుకున్నారు.ఇక ఆ తర్వాత పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘టెంపర్ ‘ సినిమా(Temper )లో కూడా కాజల్ నే హీరోయిన్ గా తీసుకున్నారు.ఇక ఈ రెండు సినిమాల తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన ‘గోవిందుడు అందరివాడేలే‘ సినిమాలో కూడా తననే రిపీట్ చేశారు… ఇక ఈ మూడు సినిమాల్లో కాజల్ ను తీసుకోవాల్సిన అవసరం ఏముంది అని బండ్ల గణేష్ ని అడిగితే ఆయన మాత్రం కాజల్ పర్ఫామెన్స్ బాగుంటుంది.
ఆమె తీసుకునే రెమ్యూన రేషన్ కూడా మాకు అనుకూలంగా ఉంటుందననే ఉద్దేశంతోనే తనను సినిమాల్లో తీసుకున్నామని చెప్పాడు.ఇక అలాగే మా సినిమాల్లోని పాత్రలు కూడా ఆమె సరిగ్గా సరిపోతుందని మా దర్శకులు కూడా ఆమెను తీసుకోవడానికి ఇష్టపడ్డారని చెప్పాడు…
.