స్టార్ హీరో బాలయ్య( Balayya ) సినీ కెరీర్ లో రీమేక్ సినిమాలు ఒకింత తక్కువేననే సంగతి తెలిసిందే.గత 20 ఏళ్లలో బాలయ్య సామి రీమేక్ లక్ష్మీ నరసింహ ( Lakshmi Narasimha )సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు.
ఆ తర్వాత లవకుశ రీమేక్ శ్రీరామరాజ్యంలో నటించి కమర్షియల్ హిట్ సాధించకపోయినా ప్రశంసలు అందుకున్నారు.అయితే శ్రీరామరాజ్యం మూవీ ( Sri Ramarajyam movie )రీమేక్ మూవీ కాదనే చాలామంది భావిస్తారు.
అయితే బాలయ్య మాత్రం 20 ఏళ్ల తర్వాత మరో రీమేక్ దిశగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది.ఆవేశం రీమేక్ లో బాలయ్య నటించబోతున్నారని వైరల్ అవుతున్న వార్తల సారాంశం అందుతోంది.
వైరల్ అవుతున్న వార్త నిజమైతే అభిమానుల సంతోషానికి అవధులు ఉండవని చెప్పవచ్చు.త్వరలో వైరల్ అవుతున్న ఈ వార్తకు సంబంధించి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.
బాలయ్య కథ ఎంతో అద్భుతంగా ఉంటే రీమేక్ సినిమాలకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది.మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్( Mythri Movie Makers Banner ) లో ఈ సినిమా తెరకెక్కే ఛాన్స్ అయితే ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.బాలయ్య రెమ్యునరేషన్ 35 కోట్ల రూపాయల ( Remuneration is Rs 35 Crores )రేంజ్ లో ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.బాలయ్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండటం గమనార్హం.
బాలయ్య నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.స్టార్ హీరో బాలయ్య ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను పూర్తి చేయడానికి మరో రెండేళ్ల సమయం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.బాలయ్య కెరీర్ ప్లానింగ్స్ మాత్రం అదుర్స్ అనేలా ఉన్నాయి.బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో అఖండ2 సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.అఖండ2 బడ్జెట్ 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువగా ఉందని సమాచారం అందుతోంది.