తండేల్‌ మూవీ టీం కరాచీకి వెళ్తుందా.. పెద్ద రిస్కే చేస్తున్నారుగా..!

అక్కినేని నాగచైతన్య( Naga Chaitanya ) థాంక్యూ, లాల్ సింగ్ చద్దా, కస్టడీ సినిమాతో బ్యాక్-టు-బ్యాక్ ఫ్లాప్స్ అందుకున్నాడు.ఇప్పుడు అతను హిట్ కొట్టడం అత్యవసరంగా మారింది.

 Why Thandel Movie Team Taking Big Risk , Naga Chaitanya , Thandel Movie, Thand-TeluguStop.com

అందుకే ఈ హీరో తన నెక్స్ట్ మూవీ తండేల్‌పై బాగా ఆశలు పెట్టుకున్నాడు.దీనిని రూ.100 కోట్ల పెట్టుబడితో గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తోంది.ఈ సినిమా ఫస్ట్ పోస్టర్, టీజర్ అన్నీ ప్రేక్షకుల్లో సినిమాపై ఒక మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేశాయి.మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది.ఇందులో తన పాత్రకు 100% న్యాయం చేయాలని నాగచైతన్య చాలా శ్రమిస్తున్నట్లు సమాచారం.

Telugu Game Changer, Geetha, Gujarat, Karachi, Naga Chaitanya, Pakistan, Sai Pal

ఈ ఏడాది డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా తండేల్‌ సినిమాని రిలీజ్ చేద్దామని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.అయితే అదే పండుగ సందర్భంగా రామ్ చరణ్ సినిమా “గేమ్ ఛేంజర్( Game Changer ) కూడా రిలీజ్ కానుందని వార్తలు వస్తున్నాయి.అయితే ఫస్ట్ డేస్‌లో బాగా డబ్బులు రాబట్టాలని, కథ ఏంటో చెప్పకుండా సస్పెన్స్ క్రియేట్ చేసి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలని దర్శకనిర్మాతలు అనుకుంటారు.కానీ తండేల్‌ మూవీ ప్రొడ్యూసర్ బన్నీ వాసు మాత్రం రీసెంట్‌గా మీడియాతో మాట్లాడుతూ ఆ మూవీ స్టోరీ రివీల్ చేశాడు.</br

Telugu Game Changer, Geetha, Gujarat, Karachi, Naga Chaitanya, Pakistan, Sai Pal

కథ చాలా ఆసక్తికరంగా సాగుతుందని, స్టోరీ లైన్ సో ఇంట్రస్టింగ్‌ అని, ఇది రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తీస్తున్న సినిమా అని బన్నీ వాసు తెలిపాడు.సాధారణంగా తెలుగు దర్శకులు క్రియేటివ్ లిబర్టీ పేరిట వాస్తవమైన సంఘటనలను కూడా ఫిక్షనల్ స్టోరీగా మార్చేస్తారు.మరి తండేల్ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.ఈ సినిమా స్టోరీ ఏంటంటే, 21 మంది జాలర్లు శ్రీకాకుళం సమీపంలో ఉన్న మచిలేశ్వరం నుంచి గుజరాత్( Gujarat) రాష్ట్రానికి బయలుదేరుతారు.

అక్కడ కంట్రాక్టు-బేస్డ్ వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు.కొద్ది రోజులకు పాకిస్థాన్ మధ్యలో ఉన్న సముద్రజలాల్లో లెక్కలేనన్ని చేపలు ఉన్నాయని తెలుసుకుంటారు.అయితే ఆ ప్లేస్ పాక్‌లో ఉందనే విషయం వాళ్ళకి తెలియదు.అందువల్ల ఈ జాలర్లు అనుకోకుండా పాకిస్థాన్ ఆధీనంలోని జలాల్లో ప్రవేశిస్తారు.

తర్వాత పాక్‌ ఆర్మీకి దొరికిపోతారు.పాక్‌-భారత్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే శత్రుత్వం ఉంది.

ఇలాంటి పరిస్థితులలో వారు ఆర్మీకి చిక్కి ఎలా బయటపడ్డారనేది మిగతా స్టోరీ.ఇందులో సాయి పల్లవి-నాగచైతన్య మధ్య ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ కూడా ఉంటుందట.

అయితే ఈ మూవీ చాలా నేచురల్‌గా రావడానికి లోకల్ మత్స్యకారుల్ని కరాచీ( Karachi )కి తీసుకువెళ్తామని బన్నీ వాసు చెబుతున్నాడు.ఇండియన్‌ గవర్నమెంట్‌ పర్మిషన్ తీసుకొని అక్కడ షూటింగ్ చేయాలని చూస్తున్నారు కానీ అది అంత ఈజీ ఏం కాదు.

ఆడియన్స్‌ను కరాచీకి తీసుకు వెళ్లాలని ఉద్దేశంతోనే అలా చేస్తున్నట్లు నిర్మాత చెబుతున్నాడు కానీ దీనివల్ల వచ్చేదేమీ లేదు.కరాచీకి తీసుకెళ్లినట్లు కథ, కథనంలో బలంగా చూపిస్తే సరిపోతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube