తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ (Ram Charan )మొదటి సినిమాతోనే భారీ సక్సెస్ ని సాధించాడు.ఇక అప్పటినుంచి ఇప్పటివరకు తను వెను తిరిగి చూడకుండా సూపర్ సక్సెస్ లను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా అవతరించడమే కాకుండా రంగస్థలం సినిమా( Rangasthalam )లో తన నటనను చూసిన ప్రతి ఒక్కరు ఆయనకు ఫ్యాన్ గా మారిపోయారు.ఇక ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది హీరోలు కూడా తనకు డై హార్ట్ ఫ్యాన్స్ గా ఉన్నారనే విషయం మనలో చాలామందికి తెలియదు…
ఇంతకీ ఆ హీరోలు ఎవరు అంటే వైవిద్య భరితమైన కథాంశాలతో సినిమాలను చేస్తూ ఇప్పుడిప్పుడే తనకంటూ ఒక స్ట్రైచర్ ను ఏర్పాటు చేసుకుంటున్న హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram ).ఈయనకి రామ్ చరణ్ అంటే చాలా ఇష్టమట.అందుకే రామ్ చరణ్ సినిమాల్లో ఆయన చేసే పాత్రలన్నా కూడా తనకు చాలా ఇష్టమట.
ఇక ఇదిలా ఉంటే ఆయనతో కలిసి నటించడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని ఒకానొక సందర్భంలో తెలియజేశాడు…ఇక ఈయనతో పాటుగా నటుడు ప్రియదర్శి(Priyadarshi )కి కూడా రామ్ చరణ్ అంటే చాలా ఇష్టమట.
ఆయన సినిమాల్లో ఎప్పుడూ ఆఫర్ వచ్చిన కూడా వదులుకోనని రీసెట్ గా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు.ఇక మొత్తానికైతే ఈ నటులు మన ఇండస్ట్రీలో ఉన్న రామ్ చరణ్ కి చాలా పెద్ద ఫ్యాన్స్ అవడం అనేది నిజంగా మెగా ఫ్యామిలీకి దక్కిన ఒక అరుదైన గౌరవమనే చెప్పాలి.ఇక ఇది తెలిసిన మెగా ఫ్యాన్స్ కూడా సంబరాలు చేసుకుంటున్నారు… ఇక వీళ్లతో పాటు గా ఇండస్ట్రీలోనే ఇంకా చాలామంది రామ్ చరణ్ కు వీరాభిమానులు ఉన్నారు…
.