వైరల్ నోట్: తండ్రి అపార్థం చేసుకున్నాడని కుమార్తె బలవన్మరణం..

ఈ మధ్యకాలంలో విద్యార్థులు ఏ చిన్న విషయానికైనా పోరాడకుండా చివరికి వారి ప్రాణాలను పణంగా పెట్టి పనులు చేస్తున్నారు.ఈ సంఘటనలో చాలామంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.

 Father's Misunderstanding Of Viral Note, Daughter's Death, Nandyal, Machrla, Sus-TeluguStop.com

రక్తసంబంధం తోనే బాంధవ్యం ఉండదని నిరూపించాలేని ఓ యువతి తాజాగా ఆత్మహత్య చేసుకుంది.తాను అన్నగా భావించిన వ్యక్తితో మరో విధంగా అపార్థం చేసుకున్న తండ్రి కూతుర్ని మందలించడంతో అమ్మాయి మనస్థాపానికి గురై చివరికి ప్రాణాలు తీసుకుంది.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.

Telugu Daughters, Dhone, Fathers, Machrla, Nandyal-Latest News - Telugu

నంద్యాల జిల్లా డోన్( Nandyala District Don ) పెట్టడానికి చెందిన రామేశ్వరి, గౌరప్ప( Rameshwari, Gaurappa ) దంపతులకు ఓ కుమారుడు, ఇద్దరూ అమ్మాయిలు ఉన్నారు.ఇందులో పెద్ద కుమార్తె రేణుక ఎల్లమ్మ ( Renuka Ellamma )మాచర్ల పట్టణంలోని న్యూటన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో సీఎస్సీ బ్రాంచ్ లో రెండో సంవత్సరం చదువుతోంది.ఈమధ్య సెలవులు ముగించుకొని కళాశాలకి తిరిగి వెళ్ళింది.

మాచర్ల పట్టణంలోని స్థానిక ఆంధ్ర బ్యాంక్ పైన ఉన్న కళాశాల వసతి గృహంలో అమ్మాయి తన స్నేహితురాలతో కలిసి జీవిస్తోంది.ఇకపోతే ఆ అమ్మాయిని చెల్లెలిగా చూసుకునే ఓ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థి ఫోన్ చేయగా ఆమె పనిలో ఉండి ఫోన్కు స్పందించలేదు.

దీంతో ఆ విద్యార్థి తండ్రి గౌరప్పకు కాల్ చేసి రేణుక ఫోన్ స్పందించడం లేదని చెప్పడంతో.ఆగ్రహానికి లోనైనా ఆయన కూతురికి ఫోన్ చేసి మందలించాడు.చదువుకోమని చెప్పి కళాశాలకు పంపిస్తే.అక్కడ అబ్బాయిలతో నీకు పనేంటి అన్నట్లుగా తీవ్రంగా మందలించి తాను రేపు కళాశాలకు వస్తా అని చెప్పి ఫోన్ పెట్టేసాడు.

Telugu Daughters, Dhone, Fathers, Machrla, Nandyal-Latest News - Telugu

ఆ తర్వాత తన తండ్రి కళాశాలకు వచ్చి ఎలాంటి గొడవ సృష్టిస్తాడోన్న మనస్థాపనతో చివరకు ఈ సమస్యకు పరిష్కారంగా తన మరణం తోనే ముడిపడిందని భావించి ఆత్మహత్యకు పాల్పడింది.అయితే ఆత్మహత్య చేసుకున్న సమయంలో అమ్మాయి ఓ ఉత్తరం రాసి వసతి గృహంలో ఖాళీగా ఉన్న ఓ గదిలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.ఇక ఆ ఉత్తరంలో తాను ఎటువంటి తప్పు చేయలేదంటూ.తన తండ్రికి లేఖను రాసి చివరికి ప్రాణాలను కోల్పోయింది.మరుసటి రోజు ఉదయం తల్లిదండ్రులు వసతి గృహానికి చేరుకొని అక్కడ రేణుక కోసం అడగగా కనిపించకపోవడంతో అక్కడ వారందరూ వెతకడం ప్రారంభించారు.ఆ సమయంలో తోటి విద్యార్థినులు రూమ్లో ఉరివేసుకొని కనిపించడంతో భయపడిపోయిన వారు గట్టిగా కేకలు వేయడంతో వసతి గృహ సిబ్బంది, అలాగే అమ్మాయి తల్లితండ్రులు అక్కడి చేరుకొని బోరున విలపించారు.

ఇక ఈ విషయాన్ని పోలీసులకు చెప్పడంతో మాచర్ల పట్టణ సీఐ బ్రహ్మయ్య విచారణ చేపట్టారు.ఆయన మృతురాలి స్నేహితుల నుంచి వివరాలు సేకరించి తండ్రి గౌరప్ప ఫిర్యాదు మేరకు నమోదు చేశారు.

అనంతరం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube