తెలుగు ప్రేక్షకులకు తమిళ హీరో రిషబ్ శెట్టి ( Rishabh Shetty )గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కాంతార మూవీతో ( Kantara movie )పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్నారు రిషబ్ శెట్టి.
అయితే ఈ సినిమా ముందు వరకు రిషబ్ శెట్టి ఎవరు అన్నది చాలామంది ప్రేక్షకులకు తెలియదు.కానీ ఈ ఒక్క మూవీతో భారీగా క్రేజ్ ని పాపులారిటీని సంపాదించుకున్నారు.
ఇక కాంతారా తో భారీగా క్రేజ్ ని ఏర్పరచుకున్న ఆయన ప్రస్తుతం తన తదుపరిచి సినిమాలలో భాగంగా బిజీబిజీగా ఉన్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా రిషబ్ శెట్టి తన సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ వైరల్ గా మారింది.
ఇంతకీ ఆ పోస్ట్ ఏంటి అందులో ఏమి రాసుకొచ్చారు అన్న విషయానికి వస్తే.హీరో రిషబ్ శెట్టికీ హీరో విక్రం( Vikram ) అంటే చాలా ఇష్టం.తాజాగా ఆయనని కలుసుకున్నారు రిషబ్.ఈ సందర్భంగా ఎమోషనల్ అవుతూ ఒక పోస్ట్ చేశారు.నా సినీ ప్రయాణాన్ని ప్రారంభించడానికి విక్రమ్ స్ఫూర్తి.ఆయన్ని కలవడం నా 24 ఏళ్ల కల.ఈరోజు నా దేవుడిని కలిశాను.ప్రస్తుతం ఈ భూమి మీద అదృష్టవంతుడిని నేనే అనే భావన కలుగుతోంది.
ఆయన నా లాంటి ఎంతోమంది ఆర్టిస్టుల్లో స్ఫూర్తి నింపుతున్నారు.
ఈ విషయంలో ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలి.లవ్ యూ విక్రమ్ సర్ అని ఆయనపై తనకున్న ప్రేమను పోస్ట్ రూపంలో తెలిపారు.ఆయనతో దిగిన ఫొటోలను ఎక్స్‌లో షేర్ చేశారు.
అందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.ఇకపోతే కాంతార 2 కోసం నెటిజెన్స్ ప్రేక్షకులు అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాను పూర్తి చేసే పనిలోనే ఉన్నారు రిషబ్ శెట్టి.