బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి కార్యక్రమాలలో బిగ్ బాస్ ( Bigg Boss ) రియాలిటీ షో ఒకటి.ఈ కార్యక్రమం అన్ని భాషలలోనూ ప్రసారమవుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.
ఇక తెలుగులో త్వరలోనే ఎనిమిదవ సీజన్ కూడా ప్రారంభం కాబోతుంది.ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా ఈ సీజన్ పై భారీ స్థాయిలో అంచనాలను పెరిగాయి.
ఇక ఈ కార్యక్రమానికి నాగార్జున ( Nagarjuna ) హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్లకు సంబంధించిన లిస్టు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక ఇందులో సినీ సెలబ్రిటీలతో పాటు సీరియల్ ఆర్టిస్టులు అలాగే యూట్యూబర్స్ కూడా పాల్గొనబోతున్నారని తెలుస్తుంది.అయితే తాజాగా బిగ్ బాస్ లో పాల్గొనబోయే కంటెంట్లకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ బయట పెట్టారు ప్రముఖ సర్జన్.
బిగ్ బాస్ ఛాన్స్ వచ్చిన ఎంతోమంది సెలబ్రిటీలు పెద్ద ఎత్తున తమ అందాన్ని రెట్టింపు చేసుకోవడం కోసం సర్జరీలు( Surgery ) చేయించుకుంటున్నారని ఈయన షాకింగ్ విషయాన్ని వెల్లడించారు.
ఇలా చాలామంది ఈ కార్యక్రమం ప్రారంభం అవ్వడానికంటే ముందుగా మా దగ్గరికి వస్తూ ముక్కుకు సర్జరీ చేయాలని మూతికి సర్జరీ చేయాలి అంటూ చెబుతున్నారని డాక్టర్ తెలిపారు.ఇలా అందాన్ని పెంపొందించుకోవడం కోసం సర్జరీలు చేయించుకుంటున్నారు అనే విషయాన్ని తెలియజేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.ఇలా బిగ్ బాస్ హౌస్ లో అందంగా కనపడితే మరింత మంది అభిమానులు వస్తారని అలాగే సినిమా అవకాశాలు కూడా వస్తాయని చాలామంది సెలబ్రిటీలు ఇలా సర్జరీల బాట పడుతున్నారని తెలుస్తోంది.
ఇక ఈ సీజన్లో కూడా పలువురు హాట్ బ్యూటీస్ హౌస్ లోకి అడుగుపెడుతున్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.