కెనడా, ఆస్ట్రేలియా కఠిన నిబంధనలు.. భారత్‌లోనే బెటర్ , మారుతోన్న విద్యార్ధుల ఆలోచనలు

ఏదైనా విదేశానికి చదువు, ఉపాధి నిమిత్తం వెళ్లాలంటే పంజాబీల ఫస్ట్ ఛాయిస్ ‘‘కెనడా’’నే.( Canada ) దశాబ్ధాల అనుబంధంతో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల్లో ఎవరో ఒకరు ఖచ్చితంగా కెనడాలోనే స్థిరపడటంతో పంజాబీ యువత( Punjabi Youth ) ఆ దేశానికి వెళ్లేందుకు చిన్నప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటారు.అయితే కెనడియన్ ప్రభుత్వం చేసిన ఇటీవలి విధాన మార్పులు భారతీయ విద్యార్ధుల నమోదులో గణనీయమైన క్షీణతకు కారణమవుతున్నాయి.2023లో జారీ చేసిన స్టడీ వీసాలలో( Study Visa ) 37 శాతం అందుకుని అతిపెద్ద జాతీయ సమూహంగా ఉన్న భారతీయులు ఇప్పుడు కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నారని విశ్లేషకులు అంటున్నారు.

 Punjab Pvt Colleges See Surge In Enrolments Over Stricter Visa Norms By Canada A-TeluguStop.com

మరోవైపు.మోసాలు, నకిలీ డాక్యుమెంట్లతో స్టూడెంట్ వీసాకు దరఖాస్తులు పెరుగుతున్న నేపథ్యంలో ఆస్ట్రేలియాలోని( Australia ) కొన్ని యూనివర్సిటీలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి.పలు భారతీయ రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులకు అడ్మిషన్ ఇవ్వకూడదని నిర్ణయించినట్లుగా కథనాలు వస్తున్నాయి.విక్టోరియాలోని ఫెడరేషన్ యూనివర్సిటీ, న్యూసౌత్ వేల్స్‌లోని వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీలు భారతీయ రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, జమ్మూకాశ్మీర్‌లకు చెందిన విద్యార్ధులకు అడ్మిషన్ ఇవ్వొద్దని నిర్ణయించాయి.

Telugu Visa, Australia, Canada, Indian, Punjab, Punjabprivate, Strictervisa, Wes

కెనడా, ఆస్ట్రేలియాలు కఠినమైన వీసా నిబంధనల కారణంగా పంజాబ్‌లోని ప్రైవేట్ కళాశాలలు ఈ ఏడాది అడ్మిషన్లలో గణనీయమైన పెరుగుదలను చూస్తున్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి.ఈ మార్పులు చాలా మంది ఔత్సాహిక విద్యార్ధులు విదేశాల్లో చదువుకునే వారి ప్రణాళికలను పున: పరిశీలించడానికి బదులుగా స్థానిక సంస్థలను ఎంచుకోవడానికి దారితీశాయి.కెనడా, ఆస్ట్రేలియా తమ వీసా( Visa ) నిబంధనలను కఠినతరం చేయడం, సుదీర్ఘ ప్రాసెసింగ్ సమయం, కఠినమైన డాక్యుమెంటేషన్ కారణంగా విద్యార్ధులు, వారి కుటుంబ సభ్యులు భారత్‌లోనే మంచి కళాశాలల్లో చదువుకోవడం బెటర్ అనే అభిప్రాయానికి వచ్చేశాయి.

Telugu Visa, Australia, Canada, Indian, Punjab, Punjabprivate, Strictervisa, Wes

పంజాబ్‌లోని ప్రైవేట్ కళాశాలు( Punjab Private Colleges ) ఈ మార్పుతో ప్రయోజనం పొందుతున్నాయి.అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌ల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నట్లు నివేదించాయి.విద్యార్ధులను ఆకర్షించడానికి , నిలుపుకోవడానికి, తమ విద్యా పరిధిని, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి విద్యాసంస్థలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాయి.

అత్యాధునిక సౌకర్యాలు, అనుభవజ్ఞులైన అధ్యాపకుల కోసం పెట్టుబడి పెడుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube