ఈఫిల్ టవర్ ముందు ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ రొమాంటిక్ ప్రపోజల్.. వీడియో వైరల్..

ఈఫిల్ టవర్ ( Eiffel Tower )ముందు ప్రపోజల్ చేయాలని ఎవరికి అనిపించదు? అందరూ అలానే కోరుకుంటారు కదా! అయితే ఈ కలను కొందరు మాత్రమే నెరవేర్చుకోగలరు.అలాంటి వ్యక్తుల్లో తాజాగా ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ చేరాడు.2024 పారిస్ ఒలింపిక్స్‌లో పార్టిసిపేట్ చేసిన మెన్స్ యూఎస్ రోయింగ్ జట్టులో ఇతడు ఒకడు.ఈ యూఎస్ టీమ్ గోల్డ్ మెడల్స్‌ సాధించింది.

 Olympic Gold Medalist Romantic Proposal Video In Front Of Eiffel Tower Goes Vira-TeluguStop.com

దానివల్ల అతడు కూడా గోల్డ్ మెడలిస్ట్ అయ్యాడు.ఈ ఒలింపియన్ పేరు జస్టిన్ బెస్ట్.

( Justin best ) ఇతనొక యువ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ కూడా.అయితే తన ప్రియురాలికి ఈఫిల్ టవర్ ముందు ప్రపోజ్ చేసి తన కలను నిజం చేసుకున్నాడు.

జస్టిన్ బెస్ట్ తన ప్రేయసి లైనీ డంకన్‌కు( Lainey Duncan ) మ్యారేజ్ ప్రపోజల్ చేశాడు.ప్రపోజ్ వస్తున్నప్పుడు ఒక మోకాలి మీద వంగి కూర్చున్నాడు.ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ప్రపోజల్ వీడియో వైరల్ గా మారింది.అందులో ఈఫిల్ టవర్ బ్యాక్‌గ్రౌండ్‌లో జస్టిన్ ఒక మోకాలి మీద కూర్చుని లైనీని తన జీవిత భాగస్వామి అవ్వాలని కోరుతున్నాడు.

అమెరికన్ అథ్లెట్ ఈ ప్రపోజల్‌ కోసం ఒక ప్రత్యేకమైన ప్లాన్ చేశాడు.తన లవర్ కోసం 2,700 కంటే ఎక్కువ పసుపు రంగు గులాబీలు తెచ్చాడు.

తెల్లటి గౌను ధరించిన డంకన్ చాలా సర్‌ప్రైజ్ అయింది.వీడియోలో జస్టిన్ బెస్ట్, “లైనీ ఒలివియా డంకన్, నువ్వు నా జీవితం”, అని చెబుతున్న శబ్దం వినిపిస్తుంది.

“నువ్వు చాలా ప్రత్యేకమైనదని నాకు అప్పటికే తెలుసు.మన ఫస్ట్ డేట్‌లోనే నేను నీతో, ‘నేను ఒలింపిక్స్‌కు వెళ్లాలనుకుంటున్నాను’ అని చెప్పాను.నువ్వు ఎలాంటి ప్రశ్నలు అడగకుండా, ‘ఎస్, వెళ్ళు’ అని చెప్పావు.నువ్వు అందంగా ఉంటావు, చాలా తెలివైనదానివి, నీ మంచితనం అందరికీ తెలుసు.నేను ఎవరినైనా అడిగినా నీ గురించి చెడుగా చెప్పరు” అని ఆ 26 ఏళ్ల ప్రియుడు అన్నాడు.అక్కడ చాలా మంది జంట కోసం చప్పట్లు కొట్టడానికి, కంగ్రాచ్యులేట్ చేయడానికి వచ్చారు.

జస్టిన్ బెస్ట్ ఒక ఉంగరాన్ని తీసి లైనీ డంకన్‌తో, “ఇది నా జీవితంలో అతి సులభమైన ప్రశ్న.నేను మిగతా జీవితం మొత్తం నీతో గడపాలని, కలిసి ఒక కుటుంబాన్ని పెంచుకోవాలని కోరుకుంటున్నాను.

లైనీ, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా?” అని అడిగాడు.లైనీ బెస్ట్‌ను గట్టిగా హగ్ చేసుకుని, “ఎస్” అని చెప్పింది.

“ప్రతి యెల్లో రోజ్‌ నీతో నేను కలిసి గడిపిన ఒక రోజును సూచిస్తుంది.మనం స్నాప్‌చాట్ ద్వారా కమ్యూనికేట్ చేశాం.మన స్ట్రీక్ ప్రస్తుతం 2,738 రోజులు ఉంది.కాబట్టి 2,738 యెల్లో రోజ్‌లు ప్రపోజల్ సమయంలో తీసుకొచ్చాను.మన ప్రేమ ఇప్పుడు నిజంగా చిరస్మరణీయమైంది” అని ఆయన వివరించాడు.ఈ డ్రీమీ ప్రపోజల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

యూఎస్ రోయింగ్ అఫీషియల్ అకౌంట్ కూడా దీన్ని షేర్ చేసింది.ఒక యూజర్, “జస్టిన్ బెస్ట్, లైనీ డంకన్ల ప్రేమ కథపై నెట్‌ఫ్లిక్స్ ఒక సినిమా తీయాలి” అని చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube