ట్రావెల్ వీసా రిక్వెస్ట్‌ను రిజెక్ట్ చేసిన ఆ కంట్రీ.. వాళ్లకి బుర్ర లేదా?

సాధారణంగా ఒక దేశానికి వెళ్లాలంటే ఆ దేశం నుంచి వీసా( Visa ) పొందాలి.అయితే కొన్ని కారణాల వల్ల దేశాలు వీసా జారీ చేయకపోవచ్చు.

 Aren't Those Country People Who Rejected The Travel Visa Request Stupid, Dubai,-TeluguStop.com

మామూలుగా ట్రావెల్ వీసా ను చాలా కంట్రీలు మంజూరు చేస్తాయి దీనివల్ల లోకల్ ఎకనామిక్ బూస్ట్ ఇచ్చినట్లు అవుతుందని ఈ పని చేస్తాయి.ఇలాంటి క్రైమ్ రికార్డ్ లేని వారు, అనుమానాస్పద వ్యక్తులకు తప్ప మిగతా వారందరికీ ట్రావెల్ వీసా లభిస్తుంది.

అయితే కొన్ని దేశాలు చిత్రమైన కారణాలతో ఈ వీసాలను రిజెక్ట్ చేస్తూ షాకలిస్తుంటాయి.తాజాగా ఓ దుబాయ్‌ నివాసికి కూడా ఇలాంటి చెడు అనుభవమే ఎదురయ్యింది.

అతడు తనకు వీసా ఇవ్వని మరొక దేశాన్ని అవహేళన చేశాడు.

ఆ దేశం పేరు చెప్పకుండానే దుబాయ్ గొప్పదని చెప్తూ ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ఈ వ్యక్తి పేరు ఎల్విట్ ఎబ్రహిమి( Elvit Ebrahimi ).ఆయన ఆ వీడియోలో, ఆ దేశపు వీసా అధికారులు తనను నమ్మలేదని, తాను ఆ దేశానికి వెళ్లిన తర్వాత మళ్లీ దుబాయ్‌కి తిరిగి రాకపోవచ్చని వీసా అధికారులు అనుమానించారని చెప్పి వారిని హేళన చేశాడు.అంటే ఈ వ్యక్తి ట్రావెల్స్ మీద వచ్చి అదే దేశంలో పర్మినెంట్ గా సెటిల్ అవుతాడని ఆదేశాధికారులు అనుమానించారట.

“దుబాయ్‌లో నివసించడం అనేది నిజంగా ఒక వరం.ఇక్కడి ప్రజలు చాలా మంచి మనస్కులు.మేము అందరం కలిసి ఒక బలమైన సమాజాన్ని ఏర్పాటు చేసుకున్నాము,” అని ఎల్విట్ ఎబ్రహిమి ఇన్‌స్టాగ్రామ్‌లో రాశాడు.

వైరల్ వీడియోలో, ఎల్విట్ ఎబ్రహిమి, “నాకు మొదటిసారి వీసా రిజెక్షన్ అయింది.నేను దుబాయ్‌కి తిరిగి వెళ్తాను అని నిరూపించేలా నీ దగ్గర సరిపడా పత్రాలు లేవు అని వారు చెప్పారు.,” అని నవ్వుతూ అన్నాడు.

“కొద్దిసేపు నేను ఆ అధికారితో, ‘ మీరన్న మాటలు మీకైనా అర్థం అవుతున్నాయా? ఆ వాక్యాన్ని మళ్ళీ చెప్పగలరా?’ అని అనాలని అనుకున్నా.దుబాయ్ అనేది ప్రపంచంలోనే ఉత్తమ దేశం.నేను నా జీవితాంతం దీనికి రుణపడి ఉంటాను.

నేను వేరే దేశంలోనే ఉంటాను అని వాళ్ళు అనడం చాలా హాస్యాస్పదం.ఆ దేశంలో వాళ్లకు బుర్ర లేదు.

నా కుటుంబం అక్కడ నివసిస్తున్నందుకు తప్ప, నేను ఆ దేశానికి ఎప్పుడూ వెళ్లాలని అనుకోను” అని ఆయన చెప్పారు.తన వీసా అప్లికేషన్‌ను తిరస్కరించిన దేశాన్ని ఆయన ఇలా తప్పుబట్టారు.

అయితే ఈ దుబాయ్ వ్యక్తి షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపింది.అది అమెరికానో లేదంటే యూకేనో చెప్పాలంటూ చాలామంది ఆస్క్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube