పోకీమాన్ కార్డ్ కలెక్షన్‌ను అమ్మేసిన కిడ్.. ఏ మంచి కారణం కోసమే తెలిస్తే..

ఒక గొప్ప పని చేయడానికి పెద్ద వాళ్లే అయి ఉండాల్సిన అవసరం లేదు.కొన్నిసార్లు చిన్నవాళ్లు కూడా గొప్ప మనసు చేసుకొని ఇతరులను కాపాడుతుంటారు.

 If Only The Kid Who Sold His Pokemon Card Collection Was For A Good Cause, The U-TeluguStop.com

తాజాగా కూడా ఒక అమెరికన్ అబ్బాయి మంచి పని చేసి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు.ఈ బాలుడు తన కుక్క ప్రాణాలు కాపాడడానికి చాలా గొప్ప పని చేశాడు.

బ్రైసన్ క్లీమాన్ అనే ఆ అబ్బాయికి పోకీమాన్ కార్డులంటే చాలా ఇష్టం.అతను చాలా ఏళ్ళుగా వాటిని సేకరిస్తున్నాడు.

కానీ తన కుక్క బ్రూస్‌కి ఒక పెద్ద ఆపరేషన్ చేయించాలని తెలుసుకోగానే.తన దగ్గరున్న పోకీమాన్ కార్డులన్నీ అమ్మేశాడు.

అలా ఆ ఆపరేషన్‌కి కావాల్సిన డబ్బులు సేకరించే ప్రయత్నం చేశాడు.అతని చేసిన మంచి పనికి చాలా మంది ఫిదా అయ్యారు.

ప్రపంచంలోని అనేకమంది దాతల నుంచి కూడా అతనికి డబ్బులు వచ్చాయి.ఈ సంఘటన 2021లో జరిగింది.ఆ అబ్బాయికి అప్పుడు ఎనిమిది సంవత్సరాలు.ఇప్పుడు మళ్ళీ ఈ బాలుడి స్టోరీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇటీవల ఈ బాలుడు అమ్మ కిమ్‌బర్లీ ( Kimberly )మాట్లాడుతూ “బ్రైసన్‌ పెంచుకుంటున్న కుక్క పేరు బ్రూస్.బ్రూస్ అనారోగ్యం బారిన పడి చాలా సఫర్ అయింది.

నేను బ్రూస్‌ని వెటర్నరీ డాక్టర్‌కి చూపించా.బ్రూస్‌కి పార్వో వైరస్ అనే వ్యాధి వచ్చిందని, ఆ వ్యాధిని నయం చేయడానికి 700 డాలర్ల డబ్బులు అవసరమని డాక్టర్ చెప్పారు.బ్రైసన్‌( Bryson ) తన పోకీమాన్ కార్డులను అమ్మితే, బ్రూస్‌ సర్జరీకి డబ్బులు చేరతాయని అనుకున్నాడు.” అని చెప్పింది.

అతను కార్డులను అమ్మాలని నిర్ణయించుకున్నప్పుడు, అమ్మ మొదట అంగీకరించలేదు.కానీ తరువాత, బ్రైసన్ తన కార్డులను అమ్ముతున్న ఫోటో చూసి, తల్లి చాలా ఎమోషనల్ అయ్యింది.బ్రైసన్ గురించి తెలిసి, చాలా మంది అతనికి చాలా మంది డబ్బులు ఇచ్చారు.అలా బ్రూస్‌కి చికిత్స చేయించడానికి కావలసినంత డబ్బు చేరింది.

కొంతమంది పొరుగువారు బ్రైసన్ రీస్టాక్‌లో సహాయపడటానికి వారి సొంత పోకీమాన్ కార్డ్ కలెక్షన్లు విరాళంగా ఇచ్చారు.ఆస్ట్రేలియా, చైనా, ఐర్లాండ్ నుంచి మరికొందరు డబ్బు, కుక్క సామాగ్రిని విరాళంగా ఇచ్చారు.గోఫండ్‌మీ ప్రచారం వారంలో దాదాపు 19,500 డాలర్లు (సుమారు రూ.16 లక్షలు) వసూలు చేసింది.ఈ డబ్బుల్లో చాలావరకు పెంపుడు జంతువుల సంరక్షణ ఖర్చులతో పోరాడుతున్న స్థానిక ఆశ్రయాలకు, కుటుంబాలకు సహాయం చేయాలని కింబర్లీ నిర్ణయించుకున్నారు.కథ వైరల్ కావడంతో, సోషల్ మీడియా వినియోగదారులు బ్రైసన్ ప్రయత్నాన్ని మెచ్చుకున్నారు, “ఈ యువకుడు హీరో” అంటూ బాగా పొగిడారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube