రామ్ పోతినేని( Ram Pothineni ) హీరోగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే.ఈ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన డబుల్ ఇస్మార్ట్( Double Ismart ) థియేటర్లలో విడుదల కావడానికి మరో వారం రోజుల సమయం మాత్రమే ఉంది.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా డబుల్ ఇస్మార్ట్ సినిమా కోసం ఏకంగా 18 కిలోల బరువు తగ్గానని రామ్ వెల్లడించడం గమనార్హం.
డబుల్ ఇస్మార్ట్ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుందని కావ్య మంచి డ్యాన్సర్ అని రామ్ అన్నారు.
డబుల్ ఇస్మార్ట్ లో ఎమోషన్స్ కు ప్రాధాన్యత ఉంటుందని ఆయన తెలిపారు.ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ ను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నామని రామ్ అన్నారు.
ఇస్మార్ట్ శంకర్ కు క్లైమాక్స్ హైలెట్ అని స్కంద సినిమాలో( Skanda Movie ) నా బరువు 86 కేజీలు కాగా డబుల్ ఇస్మార్ట్ 68 కిలోలు మాత్రమేనని ఆయన అన్నారు.
స్కంద షూట్ పూర్తైన తర్వాత విదేశాలకు వెళ్లి లుక్ ను మార్చుకున్నానని రామ్ అన్నారు.కేవలం 30 రోజుల్లో 18 కిలోల బరువు తగ్గానని రామ్ చెప్పుకొచ్చారు.డబుల్ ఇస్మార్ట్ మూవీ స్క్రిప్ట్ వర్క్ పూర్తైన వెంటనే ఈ సినిమాలో సంజయ్ దత్ నటిస్తే బాగుంటుందని అందరం ఫీలయ్యామని రామ్ కామెంట్లు చేయడం గమనార్హం.
సంజయ్ దత్ లైఫ్ లో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారని రామ్ తెలిపారు.
సంజయ్ దత్( Sanjay Dutt ) ఎంత పెద్ద నటుడు అయినా అందరితో కలిసిపోతారని రామ్ చెప్పుకొచ్చారు.మణిశర్మ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ నాకు ఇష్టమైన కాంబినేషన్ అని రామ్ చెప్పుకొచ్చారు.వీళ్లిద్దరి కాంబో సినిమాల్లో పాటలు సూపర్ హిట్ గా నిలుస్తాయని రామ్ కామెంట్లు చేశారు.
రామ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.