రీసెంట్ గా ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షిస్తున్న సినిమా ‘కమిటీ కుర్రోళ్ళు’.( Committee Kurrollu ) సరికొత్త కంటెంట్ తో ఈ సినిమా టీజర్, ట్రైలర్ ఆసక్తిని కలిగిస్తున్నాయి.
‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రాన్ని నిహారిక కొణిదెల( Niharika Konidela ) సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్( Pink Elephant Pictures ) ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై నిర్మాతలు పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మించారు.యదు వంశీ దర్శకత్వం వహించారు.
సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు,త్రినాద్ వర్మ, ప్రసాద్ బెహరా తదితర యంగ్ టాలెంట్ ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాలో నటించారు.
యూత్ ఫుల్ మూవీగా ఈ సినిమా క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది.ఇటీవల గ్రాండ్ గా జరిగిన ప్రి రిలీజ్ ఈవెంట్ లో అడివి శేష్, సాయి దుర్గ తేజ్ వంటి గెస్ట్స్ సినిమాను ప్రశంసించారు.
ప్రీ రిలీజ్ తర్వాత ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాపై మరింత బజ్ క్రియేట్ అయ్యింది.మంచి కంటెంట్ ఉన్న యూత్ ఫుల్ మూవీస్ ను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు.
అలా ఈ చిత్రానికి కూడా ఘన విజయం దక్కుతుందనే ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడుతున్నాయి
.