రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల( Rajanna Sirisilla District ) కేంద్రంలోని శ్రీ గాయత్రి స్వర్ణకార సంక్షేమ సంఘం( Sri Gayatri Swarnakara Sangam )ఆధ్వర్యంలో మంగళవారం రోజున సంఘ భవనంలో ప్రొఫెసర్ జయంతి వేడుకలను సంఘ సభ్యులతో కలిసి జరుపుకున్నారు.అనంతరం వారు మాట్లాడుతూ, సమైక్య రాష్ట్రంలో తెలంగాణకి జరుగుతున్న అన్యాయాన్ని యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలిసే విధంగా ప్రాణాల సైతం లెక్కచేయకుండా ప్రాణ త్యాగాన్ని చేసిన గొప్ప మహనీయుడికి విశ్వకర్మలు ఎప్పుడు రుణపడి ఉంటామని ఈ సందర్భంగా వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట స్వర్ణకార సంఘ సభ్యులు పాలోజు సతీష్, శ్రీరామోజి సత్యనారాయణ, ఎరోజు బాలా చారి, ఎర్రవెల్లి కృష్ణ, పాలోజు సంతోష్, శ్రీరామోజి శేఖర్, సిరిగిధ ధర్మచారి, సిరిగాధ కిషన్, తదితరులు పాల్గొన్నారు.