రాజన్న ఆలయ చైర్మైన్ గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశంకర్( Professor Jayashankar ) చిత్రపటానికి ప్రభుత్వం విప్ ఆది శ్రీనివాస్ మరియు ఆలయ ఈఓ కె.వినోద్ రెడ్డి లు పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్( Government Whip Adi Srinivas ) మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ ఆశయ సాధన కోసం పాటుపడతామని తెలుపుతూ ఒక విద్యావేత్తగా అనేకమంది జీవితంలో వెలుగులు నింపి, తెలంగాణ రావాలని తపనపడిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఈ ఈ రాజేష్,డీఈ రఘునందన్, ఏ ఈ నాగరాజు, గోలి శ్రీనివాస్, ఈఓ సిసి ఎడ్ల శివ, వంశీ మోహన్ ఉన్నారు.