17 సంవత్సరాలకు రాజన్న ఉద్యోగుల బదిలీలు ఆలయ ఈవో వినోద్ రెడ్డి

దక్షిణ కాశీగా పేరుగాంచిన సుప్రసిద్ధి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ( sri raja rajeshwara swamy temple , )దేవస్థానంలో ఉద్యోగులను గతంలో 2007వ సంవత్సరంలో బదిలీలు చేయగా మళ్లీ ఇప్పుడు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో బదిలీలు నిర్వహించారని ఆలయ ఈవో వినోద్ రెడ్డి (EO Vinod Reddy )వెల్లడించారు.ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వినోద్ రెడ్డి మాట్లాడుతూ వేములవాడ రాజన్న ఆలయం నుండి 27 మంది ఉద్యోగులు బదిలీ చేశారు.

 Transfers Of Rajanna Employees For 17 Years Temple Eo Vinod Reddy-TeluguStop.com

బదిలీపై వెళ్లిన ఉద్యోగులను రిలీవ్ చేయడం జరిగిందని తెలిపారు.రాష్ట్రవ్యాప్త సీనియార్టీలో భాగంగా అదనంగా మరో ఇద్దరు ఉద్యోగులను బదిలీలు అధికారులు చేశారు.

ఇప్పటి వరకు విధులు నిర్వహించిన ఇద్దరు ఏఈవో లు, ఏడుగురు పర్యవేక్షకులు ,8 మంది సీనియర్ అసిస్టెంట్లు, 10 మంది జూనియర్ అసిస్టెంట్లు , 1 డిఈ తో కలిపి మొత్తం 27 మంది బదిలీ అయ్యారు.వీరిని యాదగిరిగుట్ట, కొండగట్టు, కొమురవెల్లి, భద్రాచలం ఆలయాలకు బదిలీ చేసారు.

ఉత్తర్వులు అందుకున్న మూడు రోజుల్లో సంబంధిత ఆలయాల్లో నిధుల్లో చేరాలని బదిలీ ఉత్తర్వులలో ఆదేశాలు జారీ చేశారు .ప్రస్తుతం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వ్యక్తిగత కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న సూపరిండెంట్ గోలి శ్రీనివాస్ కూడా బదిలీ అయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube