రాగి పాత్రలలో నిల్వ చేసిన నీరు త్రాగడం వల్ల.. కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా..

సాధారణంగా ఈ మధ్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా కొంత మంది ప్రజలకు ఆరోగ్యం పై శ్రద్ధ పెరిగింది.అందుకోసం వారు వారి ఆరోగ్యానికి ఏ ఆహారం మంచిదైతే అలాంటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారు.

 Do You Know The Health Benefits Of Drinking Water Stored In Copper Vessels , Cop-TeluguStop.com

ముఖ్యంగా చెప్పాలంటే రాగి అనేది యాంటీ ఆక్సిడెంట్ అంటే ఇది అన్ని ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతుంది.వాటి వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను నివారిస్తుంది.

ఇంకా చెప్పాలంటే రాగి పాత్రలలో మంచి నీరు, ఆహారం తీసుకుంటే జరిగే మేలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే హైపర్ టెన్షన్ నీ రాగి బ్యాలెన్స్ చేస్తుంది.

అమెరికన్ క్యాన్సర్ సొసైటీ వెల్లడించిన దాని ప్రకారం రాగి కొలెస్ట్రాల్,ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడానికి ఎంతో ఉపయోగపడుతుంది.ఇంకా చెప్పాలంటే ఇది చాలా రకాల క్యాన్సర్లను అడ్డుకుంటుంది.రాగి థైరాయిడ్ గ్రంథి అసమానతను సమతుల్యం చేసి థైరాయిడ్ గ్రంధి బాగా పని చేసేలా చేస్తుంది.రాగి హిమోగ్లోబిన్ ను తయారు చేసేందుకు శరీరానికి కావాల్సిన ఇనుమును గ్రహించడంలో ఎంతగానో సాయపడుతుంది.

రాగి లో ఉన్న యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాల వల్ల ఇది ఆర్థరైటిస్, రుమటాయిడ్ తో బాధపడుతున్న వ్యాధిగ్రస్తులకు ఉపశమనాన్ని కలిగిస్తుంది.8 గంటల కంటే ఎక్కువ కాలం పాటు రాగి సీసాలో నిల్వ చేయబడిన నీరు తాగితే రోగకారక సూక్ష్మజీవులను కూడా ఇది నిరోధిస్తుంది.ముఖ్యంగా చెప్పాలంటే రాగి పాత్రలో నీటిని కానీ, ఆహారాన్ని కానీ తీసుకుంటే గుండెకు రక్త ప్రసరణను పెంచడానికి రక్తనాళాలను విస్తరించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.మెదడు సామర్థ్యాన్ని పెంచడంలో రాగి పాత్ర కీలకంగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

కాబట్టి రాగి పాత్రల లోని నీటిని తాగడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube