భారత షూటర్ మను భాకర్, అథ్లెట్ నీరజ్ చోప్రాల( Manu Bhakar , athlete Neeraj Chopra ) వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ వీడియోలో ఇద్దరూ ఓ కార్యక్రమంలో నిలబడి మాట్లాడుకుంటున్నారు.
ఏం జరుగుతుందో తెలియనప్పటికీ.ఆ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
పారిస్ ఒలింపిక్స్లో( Paris Olympics ) మను రెండు కాంస్య పతకాలు సాధించగా, జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా రజతం సాధించాడు.దీంతో పాటు మరో వీడియో వైరల్గా మారింది.
ఇందులో మను భాకర్ తల్లి సువేధా భాకర్ ( Suvedha Bhakar )నీరజ్ తో మాట్లాడుతున్నారు.
మను భాకర్, చోప్రా సంభాషణ వీడియో అథ్లెట్లు ఒకరిపై ఒకరు ‘ప్రేమ’ కలిగి ఉన్నారనే ఊహాగానాలకు ఆజ్యం పోసింది.అయితే, సోషల్ మీడియా వినియోగదారులలో ఒక వర్గం వారి మధ్య ‘సంబంధం’ పుకార్లకు ఆజ్యం పోయడానికి ప్రయత్నించిన.మరొక వర్గం వారిని విమర్శించింది.
ఇక్కడ వీడియోలో ఇద్దరూ సిగ్గుతో మాట్లాడుతున్నారు.చివరిలో మను తల్లి వారిని ఫోటోలు తీసేందుకు ప్రయత్నం చేసింది.
ఈ విషయం పై సోషల్ మీడియాలో ఓ పాటి చిన్న యుద్ధమే నడుస్తుందని చెప్పవచ్చు.ఇందులో కొందరు వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది.అందుకే కాబోలు వారు చాలా ప్రేమగా మాట్లాడుకుంటున్నట్లు వీడియోలో కనపడుతుందని కామెంట్ చేస్తుండగా.ఇంకో వర్గం వారు అలాంటిది ఏమీ లేదు., ఒక అబ్బాయి, అమ్మాయి నవ్వుతూ మాట్లాడుకుంటే చాలు.లేనిపోని కథనాలు సృష్టించడానికి రెడీగా తయారైపోతారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చూడాలి మరి ముందుముందు కాలమే ఈ ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది.ఇకపోతే ఈ ఒలంపిక్స్ లో మను రెండు కాంస్య పతకాలన్ని సాధించగా జవిలిన్ త్రో లో చోప్రా రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు.