బాధిత మహిళలకు, చిన్న పిల్లలకు భరోసా సెంటర్ ద్వారా సత్వర సేవలు అందించాలి..

రాజన్న సిరిసిల్ల జిల్లా: గురువారం రోజున పట్టణ కేద్రంలోని భరోసా సెంటర్ ని సందర్శించి లైంగిక, భౌతిక దాడులకు గురైన బాధితులకు భరోసా సెంటర్ లో కల్పించే న్యాయ సలహాలు,సైకలాజికల్ కౌన్సెలింగ్, వైద్య పరంగా తీసుకుంటున్న చర్యలు, మహిళల వేధింపులపై నమోదు అవుతున్న కేసుల వివరాలు తదితర విషయాలు అడిగి తెలుసుకొని,భరోసా సెంటర్ అందిస్తున్న సేవలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సిబ్బందికి జిల్లా ఎస్పీ సూచించారు.

 Affected Women And Children Should Be Provided Prompt Services Through Bharosa C-TeluguStop.com

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ లైంగిక దాడులకు గురైన బాధితులకు సత్వర సేవలు అందించాల్సిన బాధ్యత భరోసా కేంద్రం పై ఉందని, లైంగిక దాడులకు గురైన బాధితులకు భరోసా కల్పిండంతో పాటు వారికి పూర్తి సహయ సహకారాలను అందించాలని, జిల్లాలో ఎక్కడైనా పోక్సో, అత్యాచారం కేసులు జరగగానే సంబంధిత బాధితులను నేరుగా భరోసా సెంటర్ కు సంబంధిత అధికారులు తీసుకొని రాగానే చట్ట ప్రకారం వారికి అందించవలసిన సూచనలు సలహాలు తక్షణమే అందించాలని భరోసా సిబ్బందికి సూచించారు.

పోక్సో, అత్యాచార కేసుల్లో బాధితులకు త్వరగా కాంపెన్సేషన్ ఇప్పించడానికి వివిధ డిపార్ట్మెంట్ అధికారులు సిబ్బంది కృషి చేయాలని తెలిపారు.

భరోసా సెంటర్ సేవల గురించి జిల్లాలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించలని భరోసా సెంటర్ సిబ్బందికి సూచించారు.

ఎస్పీ వెంట టౌన్ సి.ఐ కృష్ణ, డిసిర్బీ సి.ఐ శ్రీనివాస్, ఎస్.ఐ జ్యోతి, భరోసా సెంటర్ కోఆర్డినేటర్ శిల్ప, లీగల్ సపోర్ట్ పర్సన్ అనంత, సపోర్ట్ పర్సన్ స్వభావతి, మల్లీశ్వరి, ఏ ఎన్ ఎం పవణిత ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube