ప్రభుత్వం ఆశాల జీవితాలతో ఆడుకోవద్దు

ప్రభుత్వం ఆశాల జీవితాలతో ఆడుకోవద్దని సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి కోడం రమణ అన్నారు.ఆశా వర్కర్ల విధివిధానలా పట్ల ప్రభుత్వ నిర్లక్షాన్ని నిరసిస్తూ,సిఐటియు ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఏవో వినతిపత్రం అందించడం జరిగింది.

 Don't Play With The Lives Of The Government Asha Workers, Government Asha Worker-TeluguStop.com

అనంతరం కొడం రమణ మాట్లాడుతూ, ఆశ వర్కర్ల పట్ల గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వమైనా తమ సమస్యలను పరిష్కరిస్తుందని, ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న! ఆశా వర్కర్లకు ప్రస్తుత ప్రభుత్వం కొత్త సమస్యలు తెచ్చి పెడుతుందన్నారు.ఆశా వర్కర్లకు నష్టం కలిగించే విధంగా పరీక్ష పెట్టే నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకొని ఆశా వర్కర్లకు పారితోషకాలు కాకుండా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా నెలకు 18000 /- రూ!! ఫిక్స్డ్ వేతనం అందించాలని డిమాండ్ చేసారు.

పని భారం తగ్గించి జాబ్ చాట్ ప్రకటించాలని, గత ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ప్రమాద బీమా సౌకర్యం , రిటైర్మెంట్ బెనిఫిట్స్ , పెన్షన్ లకు సంబంధించిన సర్కులర్లను జారీ చేయాలన్నారు.అర్హత కలిగిన ఆశాలకు ఏఎన్ఎం , జిఎన్ఎం పోస్టులలో ప్రాధాన్యత కల్పించే విధంగా వేయిటేజి మార్కులు నిర్ణయించాలని , పెండింగ్ బకాయిలను అందించాలని , పారితోషకాలు లేని పనులను ఆశాలతో చేయించకూడదని , వివిధ రకాల సర్వేలు , డ్యూటీలకు సంబంధించి ఆశాలకు రావలసిన టిఏ,డిఏ లను అందించాలని , ఏఎంసి తదితర టార్గెట్స్ తో సంబంధం లేకుండా వేతనాలు అందించాలని డిమాండ్ చేశారు.

జిల్లాలో మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికలలో డ్యూటీలు నిర్వహించిన ఆశా వర్కర్లకు ఎలాంటి గౌరవ వేతనం ఇవ్వలేదని, చాలా జిల్లాలలో ఎన్నికల డ్యూటీకి సంబంధించి ఆశ వర్కర్లకు గౌరవ వేతనం ఇవ్వడం జరిగిందని, జిల్లా కలెక్టర్ వెంటనే ఆశాలకు రావాల్సిన గౌరవ వేతనాన్ని అందేలా చూడాలని కోరారు.ఆశ వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం జూన్ 13న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి , ఎలిగేటి రాజశేఖర్ , రుచిత , లావణ్య , నందిని , లత తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube