ఘనంగా శాలివాహన జయంతి వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో శాలివాహన చక్రవర్తి( Shalivahana ) జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మొట్టమొదటి తెలుగు చక్రవర్తిగా గౌతమి పుత్ర శాతకర్ణి( Gautamiputra Satakarni )గా ప్రసిద్ధిచెందాడనీ పేర్కొన్నారు నవశక సృష్టికర్త ప్రథమ ఆంధ్ర మహాపాలకుడిగా శేషుని అనుగ్రహంతో కుమ్మరి ఇంట్లో జన్మించడం మా అదృష్టంగా భావిస్తున్నామన్నారు.

 Salivahana Jayanthi Celebrations , Shalivahana, Salivahana Jayanthi ,gautamipu-TeluguStop.com

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం( Telangana State Govt )1076 జీవో ను అమలు చేసి శాలివాహన చక్రవర్తి జయంతి,వర్ధంతులను అధికారికంగా జర్పించాలని కోరారు.కుమ్మర్లను ఆర్థికంగా, రాజకీయంగా, విద్య వైద్యం రంగాలలో అభివృద్ధి కొరకై ప్రభుత్వం చేయూత అందించాలని కోరారు.

చట్టసభల్లో సముచిత ప్రాతినిత్యం కల్పించాలన్నారు.కుమ్మర్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనీ లేని యెడల కుమ్మర్లంతా రాజ్యాంగబద్ధంగా రాష్ట్రమంతా న్యాయపోరాటం చేస్తామని ప్రభుత్వానికి శాలివాహన జయంతి సందర్భంగా తెలియజేస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు,యువకులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube