రాజన్న సిరిసిల్ల జిల్లా: జాతీయస్థాయిలో రాణించిన వాలీబాల్ క్రీడాకారులను ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మండల రజక సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు.రజక సంఘం అధ్యక్షులు కంచర్ల నరసయ్య( Kancharla Narasayya ) అధ్యక్షతన జరిగిన జాతీయ స్థాయి క్రీడాకారులు పెద్దూరి రమ్య,పెద్దూరి సహన లను ఆదివారం సన్మానించారు.
ఎల్లారెడ్డిపేట( Yellareddipeta ) మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన పెద్దూరి రమ్య, పెద్దూరి సహన వీరిద్దరు జాతీయస్థాయి వాలీబాల్ పోటీలలో మహారాష్ట్ర,రాజస్థాన్, అస్సాం, కర్ణాటక రాష్ట్రాలలో సీనియర్ మేట్ గా వాలీబాల్ క్రీడ( Volleyball )లో రాణించడం జరిగిందన్నారు.వీరికి ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలని కంచర్ల నరసయ్య కోరారు.
వీరిని రజక సంఘం సభ్యులు పూలదండలు శాలువాలతో మండల కేంద్రంలోని రజక సంఘం కార్యాలయంలో సన్మానం చేశారు.రాష్ట్ర రజక సంఘం కార్యదర్శి బాలమల్లు, మండల రజక సంఘం గౌరవ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, మండల సంఘం ఉపాధ్యక్షులు దొమ్మాటి దేవయ్య, బోనాల రవి ,నాయకులు కొన్నే పోచయ్య ,అజయ్ రాజు,చంద్రయ్య, రాములు, సంఘం సభ్యులు పాల్గొన్నారు.