రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని అర్హులైన జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు మంజూరు చేయాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కు టియూడబ్ల్యూజే వేములవాడ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి సయ్యద్ అలీ విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా మంగళవారం మంత్రి కేటీఆర్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు.
అర్హులైన జర్నలిస్టులకు త్వరలోనే ఇళ్ళ స్థలాలు కేటాయిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.